Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pleasant surprise: ఆకాశమార్గంలో ఉత్కంఠ.. విమానంలో పండంటి బిడ్డ జననం.. పురుడు పోసిందెవ్వరంటే..?

Baby born mid-air on Air India: లండన్ నుంచి భారత్‌లోని కొచ్చికి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న కొద్ది సేపట్లోనే విమానంలో ఉత్కంఠ

Pleasant surprise: ఆకాశమార్గంలో ఉత్కంఠ.. విమానంలో పండంటి బిడ్డ జననం.. పురుడు పోసిందెవ్వరంటే..?
Baby Born Mid Air On Air In
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 07, 2021 | 11:25 AM

Baby born mid-air on Air India: లండన్ నుంచి భారత్‌లోని కొచ్చికి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న కొద్ది సేపట్లోనే విమానంలో ఉత్కంఠ వాతావరణం అలుముకుంది. విమానంలోని ఓ గర్భిణికి ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. మహిళ ప్రసవ వేదనతో బాధపడుతున్న క్షణాలను చూసి అందరూ ఆందోళన చెందారు. చివరకు నెలలు నిండని ప్రసవం సుఖాంతమవ్వడంతో అందరరూ ఊపిరిపీల్చుకున్నారు. మహిళ ఎయిర్ ఇండియా విమానంలో ఓ గర్భిణి మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని భారత విమానాయన సంస్థ వెల్లడించింది. మంగళవారం లండన్‌ నుంచి కోచ్చిన్ ఎయిరిండియా విమానం బయలు దేరింది. ఈ క్రమంలో ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ వేదన మొదలైంది.

అయితే..విమానంలో 210 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారు. వెంటనే వీరంతా ఆ మహిళకు వైద్యం మొదలుపెట్టారు. నెలలు నిండని ప్రసవాన్ని వారు సుఖాంతం చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు, బిడ్డకు వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో విమానాన్ని మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అత్యవసరంగా లాండింగ్ చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వీరికి తోడుగా మరో ప్యాసింజర్ సైతం ఉన్నట్లు ఏయిరిండియా తెలిపింది. అనంతరం విమానం భారత్‌కు బయలుదేరింది.

తమ సిబ్బంది ఆమె కుటుంబంతో నిరంతరం టచ్‌లో ఉన్నారని.. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపింది. చికిత్స అనంతరం ఆ ముగ్గురినీ ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి భారత్‌కు తీసుకువస్తామని ఎయిరిండియా పేర్కొంది.

Also Read:

Crime News: భార్యను కడతేర్చేందుకు భర్త మాస్టర్ ప్లాన్.. మానవ బాంబుగా మారి కౌగిలించుకుని..

Ancient toilet‌: 2700 నాటి పురాతన టాయిలెట్‌.. ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..