Crime News: భార్యను కడతేర్చేందుకు భర్త మాస్టర్ ప్లాన్.. మానవ బాంబుగా మారి కౌగిలించుకుని..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 07, 2021 | 10:56 AM

Shocker Husband: వారిద్దరూ వృద్ధ దంపతులు.. అయినా కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించేందుకు

Crime News: భార్యను కడతేర్చేందుకు భర్త మాస్టర్ ప్లాన్.. మానవ బాంబుగా మారి కౌగిలించుకుని..
Crime News

Shocker Husband: వారిద్దరూ వృద్ధ దంపతులు.. అయినా కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక రచించాడు. మానవబాంబుగా మారి భార్యను కడతేర్చాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని బాంబును పేల్చి.. ఆమెతోపాటు అతను కూడా మరణించాడు. ఈ దారుణ సంఘటన మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో జరిగింది. లుంగ్‌లేయీ పట్టణానికి చెందిన రోహ్మింగ్లియానా (62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) దంపతులు. రోహ్మింగ్లియానా భార్య స్థానికంగా కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేంది. అతను ఖాళీగా ఉటూ తరచూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. గొడవలు తారాస్థాయికి చేరడంతో భార్యపై భర్త కక్షపెంచుకున్నాడు. భార్యను కడతేర్చాలని ప్రణాళిక రూపొందించాడు.

దీనిలో భాగంగా దుస్తుల లోపల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకుని రోహ్మింగ్లియానా.. భార్య కూరగాయలు విక్రయించే మార్కెట్‌కు వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అమాంతం ఆమెను కౌగిలించుకుని బాంబు మీట నొక్కాడు. దీంతో భారీ శబ్ధంతో బాంబు పేలుడు పేలిపోయింది. అనంతరం తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు సమయంలో వారి కుమార్తె కొద్ది దూరంలో ఉండడంతో.. ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని.. పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. నిందితుడు మహిళకు రెండవ భర్త అని తెలుస్తోంది. ఈ దంపతులిద్దరూ ఏడాది క్రితం విడిపోయారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమెను చంపేందుకు భర్త ప్లాన్ రచించాడని పేర్కొంటున్నారు.

Also Read:

Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్‌కు జైలా.. బెయిలా? తేలేది ఈరోజే.. డ్రగ్స్ కేసులో రాజకీయ ట్విస్ట్!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. తొమ్మిది మంది దుర్మరణం..

Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu