బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..

Ravi Kiran

Ravi Kiran | Edited By: Team Veegam

Updated on: Oct 07, 2021 | 7:52 PM

సాంకేతికత సాయంతో మోసాలకు తెగబడే వారి ఆగడాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పండుగలు, ప్రత్యేక వేడుకలు వంటి సందర్భాల్లో...

బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..
Crime

Follow us on

సాంకేతికత సాయంతో మోసాలకు తెగబడే వారి ఆగడాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పండుగలు, ప్రత్యేక వేడుకలు వంటి సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు తమ పంజా విసురుతున్నారు. ఆఫర్ల పేరుతో అమాయకులు జేబులు కొల్లగొడుతున్నారు. తాజాగా ఏపీలోని కడప జిల్లాలో జరిగిన కొత్తరకం సైబర్ మోసం కలకలంరేపుతోంది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

తమిళనాడులోని నామక్కల్, ఈరోడ్ జిల్లాలకు చెందిన గోకుల్ వేందన్, మురుగానందన్ అనే ఇద్దరు వ్యక్తులు కడప జిల్లా వ్యాప్తంగా పలువురిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించండి అంటూ.. ఆర్.సి.సి, మేకింగ్ మనీ యాప్ పేరిట ప్రజలను మోసగించారని తెలిపారు. ఈ యాప్ పేరుతో ఉన్న లింకులను ప్రజల సెల్ ఫోన్లకు పంపారని, వాటిని క్లిక్ చేయడం ద్వారా చాలా మంది తమ సొమ్ము పోగొట్టుకున్నట్లు వివరించారు. ఇలాంటి సైబర్ నేరాలతో ఆర్జించిన సొమ్మును విదేశాల్లో బిట్ కాయిన్స్ రూపంలో మళ్లించి పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తేల్చారు.. వీరి వద్ద నుంచి 23 బ్యాంక్ ఖాతాల్లోని 62.5 కోట్ల రూపాయల నగదును కడప వన్ టౌన్ పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు.. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ వివరించారు.

సైబర్‌ కేటుగాళ్ల మోసాలపై జిల్లాలోని కడప వన్ టౌన్, మైదుకూరు, దువ్వూరు, చాపాడులలో నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 కోట్ల రూపాయలకు పైగా నగదు కొల్లగొట్టినట్లు తెలిపారు. సాంకేతికత సాయంతో మోసగాళ్లను గుర్తించామని చెప్పారు. అపరిచిత లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

Read Also:  Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!

టెస్లా కంటే తోపు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120 కిమీ ప్రయాణం! త్వరలోనే భారత్‌లో లాంచ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu