Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

Viral Video: ఎప్పటిలానే ఆ జాలర్లు చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లారు. వలకు పట్టిన చిక్కులు తీసి సిద్దం చేసుకున్నారు...

Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!
Fishers Net
Follow us

| Edited By: Team Veegam

Updated on: Oct 07, 2021 | 7:39 PM

ఎప్పటిలానే ఆ జాలర్లు చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లారు. వలకు పట్టిన చిక్కులు తీసి సిద్దం చేసుకున్నారు. అటు కొంతమంది.. ఇటు కొంతమంది వలను పట్టుకుని నదిలోకి వెళ్లారు. దాన్ని అటుఇటూ కాసేపు కదిలించారు. ఇక కొంత సమయం తర్వాత ఆ వలను బయటికి తీయడం మొదలుపెట్టారు. వారికి అది కాస్త బరువుగా అనిపించింది. ఏదైనా అరుదైన ఎక్కువ బరువు ఉన్న చేప పడి ఉంటుందిలే అని ఆనందపడ్డారు. ఒకవైపు ఉత్కంఠ.. మరోవైపు ఆనందం.. ఏమై ఉంటుందనుకుంటూ వలను ఎట్టకేలకు బయటికి లాగారు. అందులో చిక్కిన దానిని చూసి జాలర్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ నుంచి పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ వలలో ఏం చిక్కింది.? ఎందుకు జాలర్లు భయపడ్డారు.? అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయినగర్ సమీపంలోని బుక్కపట్నం చెరువులో చేపల వేట కోసం జాలర్లు వేసిన వలలో పొడవైన కొండ చిలువ చిక్కుకుపోయింది. ఉదయాన్నే చేపల కోసం వలను బయటకు తీసిన జాలర్లు వలలో అతి పెద్ద చేప చిక్కుకుంది అని సంబరపడ్డారు. కానీ వలలో చిక్కుకున్న కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు కొండచిలువను చూసేందుకు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. చివరకు స్నేక్ క్యాచర్ మూర్తి సహాయంతో కొండచిలువను వల నుంచి తప్పించి బుక్కపట్నం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో స్థానికులు, జాలర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also:  సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!

బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..