Viral: పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!

పాము కనిపిస్తే చాలు వెనక్కితిరిగి చూడకుండా స్పీడ్‌గా పరిగెత్తుతాం. శరీరంలో మన గుండె ఒకే చోట ఉంటుంది. కానీ పాము విషయానికి వస్తే అలా కాదు..

Viral: పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!
Snake
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Oct 07, 2021 | 7:50 PM

పాము కనిపిస్తే చాలు వెనక్కితిరిగి చూడకుండా స్పీడ్‌గా పరిగెత్తుతాం. శరీరంలో మన గుండె ఒకే చోట ఉంటుంది. కానీ పాము విషయానికి వస్తే అలా కాదు. పాము గుండె పరిస్థితులను బట్టి తన శరీరంలో పొజిషన్‌ను మార్చుకుంటూ ఉంటుంది. వేగంగా కదిలే పాము చెట్లను ఎక్కుతున్న పుడు,తన పరిమాణానికి మించిన ఆహార జంతువును మింగుతున్నపుడు గుండె ఒకే చోట ఉంటే అది ఒత్తిడికి గురి అవుతుంది? అలాంటి సందర్భంలో పాము ఎలా అధిగమిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పాములలో గుండె స్థిరంగా ఒక చోట ఉండదు. సాధారణంగా పాములను మూడు భాగాలుగా విభజిస్తే తల ఉన్న ప్రాంతంలో మెదడు, నాలుక,కోరలు, విషగ్రంధులు ఉంటాయి. మధ్యభాగంలో గుండె, చిన్న పేగులు, తోక ప్రాంతంలో పెద్ద పేగులు ఉంటాయి. అయితే పాములు తమ పరిమాణానికి మించిన జంతువులను మింగుతుంటాయి. ఉదాహరణకు కొండ చిలువలు మేకలను జింకలను మింగుతాయి. అలాగే నాగుపాములు పెద్ద ఎలుకలను మింగుతుంటాయి. పాములకు దంతాలు లేకపోవడంతో ఆహారాన్ని నమిలి తినలేవు. యథాతధంగా ఫలానా జంతువును మింగినప్పుడు అనివార్యంగా పాము శరీరాన్ని రబ్బరులా సాగదీస్తుంది. ఈ సమయంలో పాము అంతర్భాగమంతా తాను మింగిన జంతువుతో నిండి పోతుంది.

అపుడు గుండె ఒక చోట స్థిరంగా ఉంటే అది జంతువు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో పాము గుండె దాని తోక వైపుకి చేరుతుంది. ఆహారపు జంతువు జీర్ణమవగానే తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. అలాగే పాములు వేగంగా చెట్లను ఎగబాకేటపుడు పూర్తిగా ఏటవాలుగా అవ్వడంతో అవసరమైన రక్తాన్ని పాము మెదడుకు పంప్‌ చేయడానికి గుండెకు కష్టమవుతుంది. ఈ స్థితిలో కూడా పాము గుండె పాము తలభాగానికి ప్రయాణం చేసి పాము మెదడుకు సులువుగా రక్తాన్ని పంప్‌ చేయగలుగుతుంది.

Read Also:  Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..