Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి వీడి సరదా పాడుగాను.. పాపం.. కొత్త జంటను ఎత్తిపడేశాడు.. ఫన్నీ వీడియో..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఇక మన భారతీయ సంప్రదాయంలో వివాహబంధానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Viral Video: ఓరి వీడి సరదా పాడుగాను.. పాపం.. కొత్త జంటను ఎత్తిపడేశాడు.. ఫన్నీ వీడియో..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2021 | 9:18 AM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఇక మన భారతీయ సంప్రదాయంలో వివాహబంధానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వివాహ వేడుకలో అనేక రకాల ఆచారాలు ఉంటాయి. భారతీదేశంలో విభిన్న సంస్కృతులు, మతాలు ఉండడంతో పెళ్లిళ్లు వివిధ రకాల ఆచారాలను కలిగి ఉంటాయి. బంధువులు అంతా ఒక్కచోట చేరి, డ్యాన్సులు, సంగీత కచేరీలు నిర్వహిస్తుంటారు. అయితే పెళ్లి వేడుకలలో కొన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఘటనలు జరుగుతుంటాయి. అందులో అనుకోకుండా జరిగే సంఘటనలు నవ్వులు పూయిస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలలో జరిగిన ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అందులో.. పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో వధువు వెనకాల వరుడు నిల్చోని పూజలో పాల్గోంటున్నాడు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారిద్దరి వెనక నుంచి వచ్చి.. ఇద్దరిని పట్టుకుని ఎత్తి పడేశాడు. దీంతో వధువు, వరుడు ఇద్దరూ కింద పడిపోయారు. ఆకస్మాత్తుగా జరిగిన ఆ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆతర్వాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కింద పడిపోవడంతో ఒక్కసారిగా నవ్వుతూ కనిపించారు. ఇప్పుడు ఈ వీడియోను వైరల్ క్లిప్స్ అనే ఇన్‍ స్టా యూజర్ ఖాతాలో షేర్ చేయగా.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి ఆచారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫన్నీ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.

వీడియో..

Also Read: Sherlyn Chopra: పార్టీల్లో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యాను.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్..

Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు..

Pushpa Movies: పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్.. అనుకొని షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఎంత డిమాండ్ చేసిందంటే ?