Pushpa Movies: పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్.. అనుకొని షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఎంత డిమాండ్ చేసిందంటే ?

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Oct 07, 2021 | 8:00 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న లేటేస్ట్ చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్స్ అందించిన తర్వాత

Pushpa Movies: పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్.. అనుకొని షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఎంత డిమాండ్ చేసిందంటే ?
Nora Fatehi

Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న లేటేస్ట్ చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్స్ అందించిన తర్వాత బన్నీ, సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా కావడంతో పుష్ప అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. మొదటి సారి పూర్తి స్థాయి ఢీ గ్లామర్ లుక్‏లో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరిస్తున్నారు. ఈమూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‏గా మారనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట సుకుమార్. దిశా పటానీ, సన్నీ లియోన్, జాక్వెలిన్ పెర్నాండెజ్, పూజా హెగ్డే, కత్రినా కైఫ్ అంటూ పలువురు పేర్లను పరిశీలించారట. కానీ వీరంతా ఇతర కారణాలతో పుష్ప స్పెషల్ సాంగ్‏కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దీంతో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని సంప్రదించారట మేకర్స్. అయితే నోరా డిమాండ్ విని ఒక్కసారిగా షాకయ్యారట. ఐదు నిమిషాల పాట కోసం నోరా ఫతేహి ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. గతంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో ఐటం సాంగ్ కోసం కేవలం 5 లక్షలు తీసుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు ఐదు నిమిషాల పాట కోసం ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ షాకయ్యారు. ఇక నోరా డిమాండ్ కూడా అదే రేంజ్‏లో ఉంది. సోషల్ మీడియాలో నోరాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకు నెట్టింట్లో లక్షల్లో ఫాలోయింగ్ ఉంది.

Also Read: Sherlyn Chopra: పార్టీల్లో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యాను.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్..

Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు.

Sunisith: ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పిన ‘శాక్రిఫైజ్ స్టార్‌’ సునిశిత్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu