AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sherlyn Chopra: పార్టీల్లో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యాను.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యాన్ ఖాన్‏ అరెస్ట్‏తో మరోసారి డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ముంబై క్రూజ్ రెవ్ పార్టీలో

Sherlyn Chopra: పార్టీల్లో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యాను.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్..
Sherlyn Chopra
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2021 | 7:30 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యాన్ ఖాన్‏ అరెస్ట్‏తో మరోసారి డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ముంబై క్రూజ్ రెవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులు అక్కడ షారూఖ్ తనయుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్యాన్ ఖాన్ అరెస్ట్‏తో బాలీవుడ్ ఇండస్ట్రీ ఊలిక్కి పడింది. అధికారులు డ్రగ్స్ కేసుతోపాటు.. అర్యాన్ ఖాన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే.. షారుఖ్ కుమారుడు అరెస్ట్ కావడంతో ఒకవైపు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ సినీ పరిశ్రమలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడతారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

షారుఖ్ ఖాన్‍కు సొంతంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ పేరుతో సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఓ మ్యాచ్‏లో షెర్లిన్ డ్యాన్స్ చేసింది. తాను డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ కొన్ని షాకింగ్ దృశ్యాలను చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఆ ఇంటర్వ్యూ క్లిప్‏ను షేర్ చేసింది షెర్లిన్. అందులో షెర్లిన్ మాట్లాడుతూ.. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత నేను వాష్ రూంకు వెళ్లాను. అక్కడ డోర్ ఓపెన్ చేయగానే.. కనిపించిన దృశ్యాలను చూసి షాకయ్యాను. నేను తప్పు ప్లేస్‏కు వచ్చానా ? అనిపించి.. ఒక్క క్షణం నా మైండ్ పనిచేయలేదు. ఆ తర్వాత విషయం అర్థమైంది. అక్కడున్న స్టార్ల భార్యలు.. వాష్ రూం అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఒక్కొక్కరూ సైకోలా ప్రవర్తిస్తున్నారు. వారిని చూసి ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‏కు.. అతని స్నేహితులకు గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీలో ఎలాంటివో నాకు ఆరోజే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది షెర్లిన్.

Also Read: Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు..

Bigg Boss 5 Telugu: అసలైన గేమ్ స్టార్ట్ చేశారుగా.. ఇంట్లో రాజుగారి గోడ రచ్చ… కొట్టుకున్న శ్రీరామ్-జెస్సీ…