Bigg Boss 5 Telugu: అసలైన గేమ్ స్టార్ట్ చేశారుగా.. ఇంట్లో రాజుగారి గోడ రచ్చ… కొట్టుకున్న శ్రీరామ్-జెస్సీ…

బిగ్‏బాస్ నాలుగు వారాలుగా చప్పగా సాగిన షో ఐదోవారంలో హీట్ పెరిగింది. ఇప్పటివరకు సరిగ్గా టాస్కులు ఇవ్వని బిగ్‏బాస్ ఈసారి

Bigg Boss 5 Telugu: అసలైన గేమ్ స్టార్ట్ చేశారుగా.. ఇంట్లో రాజుగారి గోడ రచ్చ... కొట్టుకున్న శ్రీరామ్-జెస్సీ...
Bigg Boss 5 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2021 | 6:32 AM

బిగ్‏బాస్ నాలుగు వారాలుగా చప్పగా సాగిన షో ఐదోవారంలో హీట్ పెరిగింది. ఇప్పటివరకు సరిగ్గా టాస్కులు ఇవ్వని బిగ్‏బాస్ ఈసారి అసలైన గేమ్ స్టా్ర్ట్ చేశారు. ఇందులో భాగంగా… ఈవారం ఇంటి సభ్యులకు రాజ్యానికి రాజు ఒక్కరే అనే టాస్క్ ఇచ్చి.. రవి, సన్నీలకు రెండు రాజ్యాలుగా విభజించించిన సంగతి తెలిసిందే. వీరిద్ధరిలో ఎవరు రాజ్యాన్ని దక్కించుకుంటారో వారే.. కెప్టెన్సీ కోసం పోటీ చేస్తారు. ఇక బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్‏లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యులకు కుస్తీ పోటీ నిర్వహించారు బిగ్‏బాస్. ఇందులో మానస్, విశ్వ మధ్య కుస్తీ పోటీ జరగ్గా..విశ్వ విజేతగా నిలిచాడు. ఇక ఆ తర్వాత జెస్సీ, యానీ మాస్టర్ మధ్య పోటీ జరగ్గా.. జెస్సీ గెలిచాడు. ఇక ఆ తర్వాత.. ప్రియాంక, శ్వేత మధ్య పోటీ మొదలవ్వగా.. ప్రియాంక ముందుగానే చేతులెత్తేసింది. దీంతో ఈపోటీలో రవి టీం విజేతగా నిలిచింది. ఇక ఆ తర్వాత రాజు గారి గోడ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‏బాస్. ఇందులో భాగంగా..గార్డెన్ ఏరియాలో ఇద్దరికి సంబంధించిన గోడలు ఉంటాయి. అందులో ఎవరి ఫోటోలు ఎక్కువగా ఉంటాయో వారే విజేత అని ప్రకటిస్తాడు బిగ్‏బాస్. అయితే టాస్క్ కోసమే ఎదురుచూస్తూ… మానస్, జెస్సీలు ఇద్దరూ గోడ వద్దే ఉండిపోతారు. దీంతో బజర్ మొగగానే.. వెంటనే అలర్ట్ అయి.. చాకచాక్యంగా గేమ్ ఆడేస్తారు. ఒకవైపు మానస్ రవికి సంబంధించిన ఫోటోలు స్వీమ్మింగ్ ఫూల్‏లో పడేయగా.. జెస్సీ.. గోడలపై సన్నీ ఫోటోలను పెట్టేస్తాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీరామ్, విశ్వ… సన్నీ ఫోటోలను తీసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇందులో విశ్వను మానస్ వారించగా.. శ్రీరామ్‏ను జెస్సీ అడ్డుకుంటాడు. అయితే ఈ టాస్క్ కాస్త కొట్లాట వరకు వెళ్లింది. శ్రీరామ్, జెస్సీ మధ్య ఫిజికల్ టాస్క్ జరిగింది. ఇందులో జెస్సీ, శ్రీరామ్ దెబ్బలు తగిలాయి. అయితే ముందుగా.. శ్రీరామ్.. జెస్సీని కొట్టాడు అని చెప్పి సన్నీ వాదించగా.. శ్రీరామ్ మాత్రం తాను కొట్టలేదని సమర్దించుకుంటాడు. మొత్తానికి రాజు గారి గోడ టాస్కులో సన్నీ టీం విజేతగా నిలిచింది.

Also Read: Sunisith: ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పిన ‘శాక్రిఫైజ్ స్టార్‌’ సునిశిత్..

Samantha: ఇక మీదట సమంత ఉండబోయేది అక్కడేనట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ నిజమేనా ?

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు దక్షిణాదిలోనే సూపర్ స్టార్.. ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాకవుతారు..