Bigg Boss 5 Telugu: ఇదే కదా కావాల్సింది.. కెప్టెన్సీ టాస్క్‏లో కంటెస్టెంట్స్ ఫుల్ ఫైర్.. ప్రోమో చూశారా ?

మొత్తానికి బిగ్ బాస్ ఫాంలోకి వచ్చాడు. సీజన్ 5 ప్రారంభమైన ఐదోవారంలో ప్రోమోతోనే ఆసక్తిని కలిగించాడు. బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19

Bigg Boss 5 Telugu: ఇదే కదా కావాల్సింది.. కెప్టెన్సీ టాస్క్‏లో కంటెస్టెంట్స్ ఫుల్ ఫైర్.. ప్రోమో చూశారా ?
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2021 | 3:55 PM

మొత్తానికి బిగ్ బాస్ ఫాంలోకి వచ్చాడు. సీజన్ 5 ప్రారంభమైన ఐదోవారంలో ప్రోమోతోనే ఆసక్తిని కలిగించాడు. బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైంది. ఇప్పటివరకు నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యి.. ప్రస్తుతం పదిహేను మంది మిగిలారు. అయితే షో ప్రారంభం నుంచి చప్పగా.. బోరింగ్‏గా సాగుతుందంటూ విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా… ఇంటి సభ్యులకు సరైన టాస్క్ ఇవ్వకుండా.. కూర్చుని కబుర్లు చెప్పుకునేలా చేశాడు. ఇక కంటెస్టెంట్స్ కూడా అందుకు తగినట్టుగానే..ఇష్టానుసారంగా ప్రవరిస్తూ వచ్చారు. దీంతో షో బోరింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

అయితే తాజాగా బిగ్ బాస్ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ మధ్య అసలైన పోటీ పెట్టాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‏లో భాగంగా.. రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ ఇచ్చాడు. అందులో రవి, సన్నీ ఇద్దరు రాజులు సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడాలని చెప్పిన సంగతి తెలిసిందే. అందరికంటే ఎక్కువ ధనం ఉన్న రాజు.. ప్రజల మద్దతు ఉన్న రాజు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటాడు. తాజాగా ఈరోజు ప్రోమో విడుదల చేశారు బిగ్ బాస్. అయితే ప్రోమోలో.. సన్నీకి తక్కువ మద్దతు ఉండగా.. రవికి ఎక్కువ మద్ధతు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కాజల్, సిరి రవి, మానస్ మధ్య హీట్ డిస్కషన్ జరిగినట్లుగా కనిపిస్తోంది. చివరకు ఇంటి సభ్యుల మధ్య టాస్క్ వీరలెవల్లో జరిగేలా చేసినట్లున్నాడు బిగ్ బాస్. ఒకరిపై మరొకరు అరుచుకోవడం.. తోసుకోవడం జరిగినట్లుగా చూపించారు. ఇక ప్రోమో చూస్తే… ఈరోజు ఇంటి సభ్యుల మధ్య రచ్చ జరిగినట్లుగా తెలుస్తుంది.

Also Read: SamChaitanya: సమంత-నాగచైతన్య అందుకే దూరమయ్యారు.. మాధవిలత షాకింగ్ కామెంట్స్..

Pooja Hegde: వారణాసిలో బుట్టబొమ్మ ప్రత్యేక పూజలు.. ఫ్యాన్స్‌ను సందేహంలో పడేస్తున్న పూజ హెగ్డే ఫొటోస్..

‘మా’ అసోసియేషన్ నడపడానికి బయటవాళ్లు కావాలా.. రవిబాబు సంచలన కామెంట్స్..

Konda Polam: నేను కాకపోతే ఆ స్టార్ డైరెక్టర్ ‘కొండపోలం’ సినిమా చేసేవారే.. ఆసక్తికర విషయం చెప్పిన క్రిష్.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!