AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా’ అసోసియేషన్ నడపడానికి బయటవాళ్లు కావాలా.. రవిబాబు సంచలన కామెంట్స్..

మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు...

'మా' అసోసియేషన్ నడపడానికి బయటవాళ్లు కావాలా.. రవిబాబు సంచలన కామెంట్స్..
Ravibabu
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 06, 2021 | 11:56 AM

Share

మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష బరిలో దిగుతున్న ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లొసుగులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా… రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నాయి.  ఇక ఇటీవల ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మంచు విష్ణు సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. అలాగే మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజ్ కు స్ట్రాంగ్ రిప్లేనే ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు, నటుడు రవిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రవి బాబు మాట్లాడుతూ.. నేను  లోకల్ నాన్ లోకల్ విషయం మాట్లాడటం లేదు.. ఈ ప్యానల్ కు ఓటెయ్యండి ఆ ప్యానల్ కు ఓటెయ్యండి అని కూడా చెప్పను.. మన సినిమా వాళ్ళు బయటనుంచి ఆర్టిస్ట్ లను తీసుకువచ్చి మన సినిమాల్లో పెడుతున్నారు.. అలాగే కెమెరామెన్లను కూడా బయటనుంచి తీసుకువస్తున్నారు.. చివరకు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రస్సర్ లను కూడా బయటనుంచి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పుడు మా అసోసియేషన్ కు కూడా బయటవాళ్ళు కావాలా.. ఆలోచించండి అంటూ ఓ వీడియోను చేశారు రవిబాబు.