Konda Polam: నేను కాకపోతే ఆ స్టార్ డైరెక్టర్ ‘కొండపోలం’ సినిమా చేసేవారే.. ఆసక్తికర విషయం చెప్పిన క్రిష్..
మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్నఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు.
Konda Polam: మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్నఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయలు చెప్పుకొచ్చారు.. ‘పుస్తకంగా రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు. పుస్తకంలో రాసిన దానిని సినిమాగా తీయాలంటే దానికి కొన్ని పరిమితులుంటాయి అన్నారు. ఉదాహరణకు సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక అద్బుతమైన కథ. చక్కటి కథనంతో రాశారు. ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఎగ్జైట్‌గా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం అని అన్నారు క్రిష్. ఇక నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకుని కొండమీదకు వెళ్తారు అక్కడ జరిగే పరిణామాలేంటి.? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపారు దర్శకుడు
మొదట గోవాకు వెళ్లి షూటింగ్ చేద్దామని అన్నారు. గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని పర్మిషన్ ఇవ్వలేదు. ఆతర్వాత నల్లమల టైగర్ జోన్ ఎంపిక చేసుకున్నాం. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో షూట్ చేశామని తెలిపారు క్రిష్. చేసే ప్రతీ సినిమా ఓ కొత్త బ్యాక్ డ్రాప్‌లో ఉండాలని అనుకుంటాను. ఇది వరకే వెంకటేష్ గారితో ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు అన్నారు. ఈ పుస్తకం గురించి ఇంద్రగంటి గారు, సుకుమార్ గారు సజెస్ట్ చేశారు. మామూలుగా దర్శకులం అంతా కూడా అప్పుడప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓ సారి మేమంతా కలిస్తే.. ఈ పుస్తకం గురించి చెప్పారు. అడ్వంచర్స్ కథ చెప్పాలని అనుకున్నప్పుడు.. సప్తభూమి, కొండపొలం పుస్తకాలు చదివాను. కొండపొలం బాగా నచ్చింది. సప్తభూమి పుస్తకాన్ని కూడా ట్రై చేశాం. అయితే కొండపొలం హక్కులు కొన్నావా? అని సుకుమార్ అడిగారు. నేను తీసుకున్నాను అని చెప్పడంతో సుకుమార్ గారు వదిలేశారు. లేకుంటే ఆయన చేసేవారు కాబోలు అన్నారు క్రిష్.
మరిన్ని ఇక్కడ చదవండి :