‎aha – OTT: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ‘ఆహా’.. త్వరలో మరో థ్రిల్ల‌ర్‌తో ప్రేక్షకుల ముందుకు..

బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, పాత్ బ్రేకింగ్ వెబ్ ఒరిజిన‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఆహా.

‎aha - OTT: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ‘ఆహా’.. త్వరలో మరో థ్రిల్ల‌ర్‌తో ప్రేక్షకుల ముందుకు..
Cold Case
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 06, 2021 | 10:26 AM

‎aha – OTT : బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, పాత్ బ్రేకింగ్ వెబ్ ఒరిజిన‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఆహా. ఇప్పుడీ కోవ‌లో పృథ్వీరాజ్ సుకుమారన్‌, అదితి బాల‌న్, పూజా మోహ‌న్‌రాజ్‌, అనిల్ నెడుమంగ‌ద్‌, ల‌క్ష్మీ ప్రియ‌, చంద్రమౌళి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘కోల్డ్ కేస్‌’.. అక్టోబ‌ర్ 8న ప్రీమియ‌ర్‌గా ఆహాలో  స్ట్రీమింగ్ కానుంది. మ‌ల‌యాళంలో ‘కోల్డ్ కేస్‌’ అనే పేరుతోనే తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫ‌ర్ త‌ను బాల‌క్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించారు. సినిమాలో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్క్రీన్‌ను అతుక్కుపోయేలా చేసే రోల‌ర్ కోస్ట‌ర్ ‘కోల్డ్ కేస్‌’.

రీసెంట్‌గా ఆహాలో విడుద‌లైన ఈ ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఫ‌ర్‌ఫెక్ట్ థ్రిల్ల‌ర్ మూవీ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఓ స‌రస్సులో పుర్రె దొరుకుతుంది. అదెవ‌రిద‌నే విష‌యం పోలీసుల‌కు అంతు చిక్క‌దు. ఆ ర‌హస్యాన్ని చేదించ‌డానికి పోలీస్ క‌మీష‌న‌ర‌ల్ స‌త్య‌జిత్‌, జ‌ర్న‌లిస్ట్ మేథ చేసిన ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసుని చేధించ‌డానికి స‌త్య‌జిత్ ఏం చేశాడ‌నేదే క‌థ‌. జ‌ర్న‌లిస్ట్‌, సింగిల్ పేరెంట్ అయిన జ‌ర్న‌లిస్ట్ మేధ.. ఓ కొత్త ఇంటికి వెళుతుంది. ఆ ఇంట్లో అసాధార‌ణ‌మైన కొన్ని విష‌యాలు జ‌రుగుతాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేమంటే, అవ‌న్నీ స‌త్య‌జిత్ ప‌రిశోధిస్తున్న కేసుకి క‌నెక్ట్ అవుతాయి. మ‌రి ఈ ఇద్ద‌రు క‌లిసి అస‌లు ర‌హ‌స్యాన్ని చేధించారా, హ‌త్య చేయ‌బ‌డింది ఎవ‌రు? అనే విష‌యాన్ని తెలుసుకున్నారా? అనేదే సినిమా.

క్రైమ్‌, థ్రిల్లర్‌, హార‌ర్‌, స‌స్పెన్స్ .. అంశాల‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేసి ‘కోల్డ్ కేస్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు అంద‌కుండా అనేక మ‌లుపులు తీసుకుంటూ సినిమా ముందుకు సాగుతుంది. పృథ్వీరాజ్, అదితి బాల‌న్ స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌ పెర్ఫామెన్స్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారింది. గిరీశ్ గంగాధ‌ర‌న్, టి.జాన్‌ సినిమాటోగ్ర‌ఫీ ఎడిట‌ర్ ష‌మీర్ ముహ‌మ్మ‌ద్ ప‌నితీరుతో క‌థ‌నాన్ని అద్భ‌తుంగా రూపొందించారు. ప్ర‌కాశ్ అలెక్స్ నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల‌ను ఓ మూడ్‌లోకి తీసుకెళుతుంది.

2021 ఏడాదిలో ‘ఆహా’ … క్రాక్‌, ఎస్.ఆర్.కళ్యాణ మండపం, వాహనములు నిలుపరాదు, సూపర్ డీలక్స్, లెవన్త్ అవర్, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తిగ‌ది దాటి, ది బేక‌ర్ అంద్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాలు, వెబ్ షోస్‌ల‌తో ప్ర‌తి ఒక తెలుగువారి ఇంట తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ భాగ‌మైంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sanjjanaa Galrani: క్యాబ్ డ్రైవర్ పై కస్సుబుస్సులాడిన హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు.. అసలేమైందంటే..

Akhanda: అఖండ షూటింగ్‌ను పూర్తి చేసిన నటసింహం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా..

Raashi Khanna: ఆ ముగ్గురు హీరోలంటే చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!