Akhanda: అఖండ షూటింగ్‌ను పూర్తి చేసిన నటసింహం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా..

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `అఖండ` మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

Akhanda: అఖండ షూటింగ్‌ను పూర్తి చేసిన నటసింహం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా..
Akhand
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 06, 2021 | 8:20 AM

Akhanda: న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `అఖండ` మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసింది యూనిట్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుదల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా విడుదల పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీదర్ షూటింగ్ విజయవంతం గా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది. బాలకృష్ణ,  బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నారు.

బాలకృష్ణ యొక్క రెండు పాత్రలను పరిచయం చేస్తూ విడుద‌ల చేసిన `అఖండ ఫ‌స్ట్ రోర్‌` కి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఇటీవ‌ల విడుద‌ల చేసిన మొదటి పాట సంగీత ప్రియులను ఆక‌ట్టుకుంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వలో నటిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి బాలయ్య కోసం ఓ కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. అటు పూరిజగన్నాథ్ కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu : ఓవరాక్షన్ చేసిన కాజల్.. లోబో చేసిన పనికి షాక్ అయిన కంటెస్టెంట్స్.. ఏం చేశాడంటే..

Bigg Boss 5 Telugu : ఓవరాక్షన్ చేసిన కాజల్.. లోబో చేసిన పనికి షాక్ అయిన కంటెస్టెంట్స్.. ఏం చేశాడంటే..

Movie shoot in Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్.. ఎవరు.. ఎప్పుడు.. మొదలెడుతున్నారంటే..