Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie shoot in Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్.. ఎవరు.. ఎప్పుడు.. మొదలెడుతున్నారంటే..

అంతరిక్షం ఎప్పుడూ సాధారణ మానవులకు ఒక అద్భుతమే. ఆ అద్భుతం కథాంశంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతరిక్షం కథనంశంగా వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే.

Movie shoot in Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్.. ఎవరు.. ఎప్పుడు.. మొదలెడుతున్నారంటే..
Film Shoot In Space
Follow us
KVD Varma

|

Updated on: Oct 05, 2021 | 9:30 PM

Movie shoot in Space: అంతరిక్షం ఎప్పుడూ సాధారణ మానవులకు ఒక అద్భుతమే. ఆ అద్భుతం కథాంశంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతరిక్షం కథనంశంగా వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. ఈ సినిమాల్లో అంతరిక్షంలోని పరిస్థితులను సెట్టింగులు వేసి స్టూడియోలలో తీసేవారు. తరువాత గ్రాఫిక్స్ మాయాజాలం మొదలయ్యాకా.. గ్రాఫిక్స్ తో ఈ సినిమాల షూటింగ్ పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు రష్యా నుంచి ఓ సినిమా రాబోతోంది. ఇది అంతరిక్షంలో జరిగిన కథ. గ్రాఫిక్స్.. స్టూడియో సెట్స్ మాకొద్దు అనుకున్నారు దర్శక నిర్మాతలు.. ఇంకేముంది.. సినిమాను ఏకంగా అంతరిక్షంలోనే తీసేయడానికి ప్లాన్ చేశేశారు.

అంతరిక్షం కథాంశంగా చేసిన ‘గ్రావిటీ’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘స్టోవే’ వంటి అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు అంతరిక్షంలో చిత్రీకరించిన సినిమా మాత్రం లేదు. కానీ, ఇప్పుడు రష్యన్ దర్శకుడు క్లిమ్ షిపెంకో అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ కంటే ముందు ఈ ఫీట్ చేయబోతున్నారు. క్లిమ్ షిపెంకో తన రాబోయే చిత్రం ‘ఛాలెంజ్’ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిత్రీకరించనున్నారు. నాసా ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

‘ఛాలెంజ్’ షూటింగ్ కోసం రష్యన్ డైరెక్టర్ క్లిమ్ షిపెంకో అక్టోబర్ 5 న (మంగళవారం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నట్లు నాసా ఈ పోస్ట్‌లో తెలిపింది. దీనితో, అంతరిక్షంలో సినిమా షూట్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా రష్యా అవతరించనుంది. ఈ పోస్ట్‌లో రష్యన్ నటి యులియా పెరెసిల్డ్, డైరెక్టర్ షిప్పెంకో, వ్యోమగామి అంటోన్ షకాప్లెరోవ్ ప్రారంభించిన సమయం గురించి కూడా నాసా సమాచారం ఇచ్చింది.

సినిమా షూట్ పై నాసా చేసిన ట్వీట్..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కోసం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 5 న కజాఖ్స్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి యులియా పెరెసిల్డ్ మరియు క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్ స్కాప్లెరోవ్‌తో కలిసి బయలుదేరినట్లు నాసా పోస్ట్‌లో నివేదించింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ద్వారా సోయుజ్ ఎంఎస్ -19 అంతరిక్ష నౌక నుంచి సిబ్బందిని ఐఎస్‌ఎస్‌కి పంపించారు.

‘ఛాలెంజ్’ టీమ్ అంతరిక్షంలో 12 రోజులు గడుపుతుంది

‘ఛాలెంజ్’ షూటింగ్ కోసం చిత్ర బృందం శిక్షణ పొందింది. ‘ఛాలెంజ్’ విభిన్న సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర బృందం 12 రోజులు స్పేస్ లో ఉంటుంది. చిత్ర బృందం 35-40 నిమిషాల నిడివి గల సీక్వెన్స్‌ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిత్రీకరిస్తుంది. వ్యోమగామిని రక్షించడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఒక మహిళా వైద్యుడి కథను ఈ చిత్రం చెబుతుంది. షూటింగ్ తరువాత, యులియా పెరెసిల్డ్, క్లిమ్ షిపెంకో మరొక రష్యన్ వ్యోమగామితో కలిసి భూమికి తిరిగి వస్తారు.

అంతరిక్షంలో మొదటి చిత్రాన్ని చిత్రీకరించే రేసులో అమెరికా కంటే రష్యా ముందు..

అంతరిక్షంలో మొదటి చిత్రాన్ని చిత్రీకరించే రేసులో రష్యా ఇప్పుడు అమెరికాను ఓడించగలదు. అంతకుముందు అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ తన రాబోయే చిత్రాన్ని నాసాతో అంతరిక్షంలో చిత్రీకరించవచ్చని చెప్పారు. ఏదేమైనా, ‘ఛాలెంజ్’ ప్రకటించినప్పటి నుండి, అంతరిక్షంలో చిత్రీకరించే ప్రణాళికలకు సంబంధించి టామ్ క్రూజ్, నాసా నుండి ఎటువంటి ప్రకటనలు బయటకు రాలేదు.

ఇవి కూడా చదవండి:

Shut Down Mystery: ఏడు గంటల షట్‌డౌన్‌.. ఎవరున్నారు.. ఏం చేశారు.. అదే నిజమా.. వివాదం వెనుక రహస్యం..

Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరు నోబెల్ బహుమతి.. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లకు పురస్కారం