Shut Down Mystery: ఏడు గంటల షట్‌డౌన్‌.. ఎవరున్నారు.. ఏం చేశారు.. అదే నిజమా.. వివాదం వెనుక రహస్యం..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Oct 05, 2021 | 1:34 PM

సుదీర్ఘ అంతరాయం వెనుక కావాలని చేసిన జిమ్మిక్కులున్నాయా? ప్రపంచంలో తన సేవల ప్రభావం ఎంతో తెలుసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా?

Shut Down Mystery: ఏడు గంటల షట్‌డౌన్‌.. ఎవరున్నారు.. ఏం చేశారు.. అదే నిజమా.. వివాదం వెనుక రహస్యం..
Zuckerberg

Follow us on

నమ్మేయాలా? రెండో వైపు లేదా? ఏడు గంటల షట్‌డౌన్‌ వెనుక కొన్ని వివాదాస్పద థియరీలు కూడా ఉన్నాయి ఆ రెండోవైపు ఏంటో ఓసారి తెలుసుకుందాం. షట్‌డౌన్‌ వెనుక ఉన్నది సర్వర్ సమస్య, రౌటర్ ఇబ్బందులేనా.. ఒకవేళ అదే నిజమైతే తెలుసుకోలేని పరిస్థితుల్లో జుకర్‌బర్గ్ టీమ్ ఉందా. ఫస్ట్‌ టైమ్‌ 7 గంటలు. ఇంతకుముందు పావుగంట, అరగంట ఓకే.. కానీ ఇంత సుదీర్ఘ అంతరాయం వెనుక కావాలని చేసిన జిమ్మిక్కులున్నాయా? ప్రపంచంలో తన సేవల ప్రభావం ఎంతో తెలుసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? భవిష్యత్ వాల్యూని ఎస్టిమేట్ వేసుకునే ట్రయల్స్ కూడా ఈ ఏడుగంటల్లో జరిగాయా.. జుకర్‌ బర్గ్ రిచ్చెస్ట్‌ పర్సన్‌ లిస్ట్‌లో 5వ ప్లేస్ నుంచి 6వ ప్లేస్‌కి పడిపోయాడు. ఇది ఇప్పుడున్న లెక్క. కానీ షేర్లు పడగొట్టి, వాటిని మళ్లీ తనే కొని స్టేక్ పెంచుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇప్పటికి తగ్గిన ఆస్తి విలువ చూస్తున్నాం. కానీ రెండుమూడు రోజుల్లో పెరిగిన స్టేక్ లెక్కలూ చూస్తామా?

ఇక కొట్టిపారేయలేని మరో అంశం హ్యాకింగ్‌. సైబర్ క్రైమ్స్‌లో ఇప్పుడు హ్యాకింగ్ పెద్ద సమస్య. ఒకవేళ హ్యాకింగ్ జరిగి ఉంటే.. అది బయటపడితే జుకర్‌బర్గ్ సత్తాపైనే అనుమానాలొస్తాయి. సో దాన్ని బయటపెట్టకుండా హ్యాకర్స్‌తో డీల్ సెట్ చేసుకునే క్రమంలో ఈ ఏడుగంటలూ గడిచిపోయిందా? ఇవన్నీ మేం లేవనెత్తుతున్న ప్రశ్నలు కాదు. ఇలా కూడా ఎందుకు జరిగి ఉండకూడదన్న వివాదాస్పద థియరీలు.

అయితే.. ప్రపంచ జనాభా 790కోట్లు ఉంటే, ఇందులో 350కోట్ల మంది ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద డిజిటల్‌ అడ్వర్టైసింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్‌ గంటపాటు ఆగిపోతే 5లక్షల 45వేల డాలర్ల నష్టం జరుగుతుంది.

ఏడు గంటలపాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోవడంతో జుకర్‌బర్గ్‌కు 7 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఒక్క ఫేస్‌బుక్‌ షేరే ఒక్కరోజులు 4.9శాతం పడిపోయింది. దాంతో, ప్రపంచ కుబేరుల్లో జుకర్‌బర్గ్‌ ఐదు నుంచి ఆరవ స్థానానికి పడిపోయాడు.

ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌లో ఇండియానే టాప్‌లో ఉంది. భారతీయులు ఒక్కరోజుకి 100 బిలియన్ సందేశాలు పంపుతున్నారు. భారత్‌లో ఫేస్‌బుక్‌ యూజర్స్ 45 కోట్లు… వాట్సాప్ యూజర్స్‌ 34కోట్లు…. ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ 18 కోట్ల మంది ఉన్నారు. ఇంత సమయం పాటు నిలిచిపోయేలా చేసింది ఎవరు..? దీని వెనుక ఏదైన అంతర్జాతీయ కుట్ర ఉందా..? అమెరికా మార్కెట్లను కూడా పడేశాలా ఎవరైనా ప్లాన్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాదానం అతి త్వరలోనే దొరుకుతుందని అంటున్నారు సాంకేతిక నిపుణులు.

ఇవి కూడా చదవండి:  Priyanka Gandhi: నన్ను ఎందుకు నిర్బంధించారో చెప్పండి.. ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu