Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Gandhi: నన్ను ఎందుకు నిర్బంధించారో చెప్పండి.. ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..

ప్రధాని మోడీజీ మీరు లఖింపూర్‌ ఖేర్‌ వెళ్తారా.. అంటూ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. లఖింపూర్‌ఖేర్‌ గ్రామానికి వెళుతున్న ప్రియాంక గాంధీని..

Priyanka Gandhi: నన్ను ఎందుకు నిర్బంధించారో చెప్పండి.. ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..
Priyanka Gandhi Tweets
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 05, 2021 | 11:26 AM

ప్రధాని మోడీజీ మీరు లఖింపూర్‌ ఖేర్‌ వెళ్తారా.. అంటూ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. లఖింపూర్‌ఖేర్‌ గ్రామానికి వెళుతున్న ప్రియాంక గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకుని, సీతాపూర్‌లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించిన సంగతి తెలిసిందే. లఖింపూర్‌ వెళ్లకుండా 28 గంటలపాటు తనను నిరవధికంగా చట్టవిరుద్ధంగా యూపీ సర్కార్ నిర్బంధించిందని ఈ సందర్భంగా ప్రధాని మోడీని ప్రశ్నించింది. ఎటువంటి ఆదేశం లేకుండా ప్రతిపక్షాలను అరెస్ట్‌ చేస్తున్నారు.. కానీ భయంకర నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రశ్నించారు.

వెంటనే అలాంటి నిందితులను అరెస్ట్‌ చేయాలని.. తమలాంటివారిని కాదంటూ హితవు పలికారు. అజాదీ అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో పాల్గనేందుకు ప్రధాని మోడీ లక్నోకు రానున్న నేపథ్యంలో ప్రియాంక ఇలా ప్రశ్నించారు. స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు ప్రధాని మోడీ వస్తున్నారని.. కాని మనకు స్వేచ్ఛను ఎవరిచ్చారని ప్రియాంక ప్రశ్నించారు. రైతులు మాకు స్వేచ్ఛనిచ్చారని గుర్తు చేశారు.

మంత్రి కుమారుడిని అరెస్ట్‌ చేయకుండా అడ్డుకోవడం మంత్రిని తొలగించకుండా లక్నోలో స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు మీకు ఎలాంటి నైతిక అధికారం ఉందని వీడియోలో అడిగారు. ఈ మంత్రి కొనసాగితే.. కేంద్రంలో ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక అధికారం లేదని మండిపడ్డారు.

ప్రధాని గారూ.. మీ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు, ఎఫ్‌ఐఆర్‌ లేకుండా తనను 28 గంటల పాటు నిర్బంధించిందని, అన్నదాతను కారుతో తొక్కించిన వ్యక్తిని మాత్రం ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.

అదే వీడియోలో ప్రియాంక ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.  ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలంటూ ఆమె పేర్కొంటున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం వీడియోలో కనిపిస్తోంది. మిర్జాపుర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లలితేశ్ పాటి త్రిపాఠి ఈ వీడియోను ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: Lakhimpur Kheri Viral Video: అన్నదాతలపైకి దూసుకెళ్లిన కారు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..

జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పరాయి స్త్రీ పై వ్యామోహమా గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్ష అంటే
పరాయి స్త్రీ పై వ్యామోహమా గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్ష అంటే
పెళ్లైన మీ కూతురికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి..!
పెళ్లైన మీ కూతురికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి..!