Priyanka Gandhi: ఇంకా నిర్బంధంలోనే ప్రియాంకా గాంధీ.. సీతాపూర్‌ గెస్ట్‌ హౌజ్‌‌కు చేరుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Oct 05, 2021 | 9:42 AM

ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు ప్రియాంకా గాంధీ. యూపీ లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు..సీతాపూర్‌ గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించారు.

Priyanka Gandhi: ఇంకా నిర్బంధంలోనే ప్రియాంకా గాంధీ.. సీతాపూర్‌ గెస్ట్‌ హౌజ్‌‌కు చేరుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు..
Priyanka Gandhi
Follow us

ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు ప్రియాంకా గాంధీ. యూపీ లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు..సీతాపూర్‌ గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించారు ప్రియాంక. ఎలాంటి ఆర్డర్‌ లేకుండా 28 గంటలుగా తనను నిర్బంధించారని ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. మరోవైపు సీతాపూర్‌ గెస్ట్‌ హౌజ్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాకు దిగారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తమ నేతను నిర్బంధించడం దారుణమంటూ రాత్రి నుంచి అక్కడే ఆందోళన చేస్తున్నారు.

ప్రియాంకాగాంధీ వర్సెస్‌ యూపీ పోలీసులు. ఎస్‌..లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు..లక్నోకు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్‌లోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించారు. దీంతో అక్కడ తాను ఉన్న రూమ్‌లో చెత్తను చీపురుతో తానే క్లీన్‌ చేసుకున్నారు ప్రియాంక.

ఆ తర్వాత ఆమె పోలీసుల తీరుకు నిరసనగా నిరాహార దీక్షకు దిగారని తెలిపారు కాంగ్రెస్‌ నేతలు. మరోవైపు ప్రియాంకగాంధీ పట్ల యూపీ పోలీసుల తీరు బాధాకరమన్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఏదో నేరం చేసినట్టుగా నిర్బంధించడం దారుణమన్నారు.

ఇవి కూడా చదవండి: Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..

PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu