iPhone 13 Pro Max: ఈ డాక్టర్‌ మాములోడు కాదు.. ఐఫోన్‌13తో కంటి చికిత్స.. నిపుణుల నుంచి ప్రశంసలు

iPhone 13 Pro Max: టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న..

iPhone 13 Pro Max: ఈ డాక్టర్‌ మాములోడు కాదు.. ఐఫోన్‌13తో కంటి చికిత్స.. నిపుణుల నుంచి ప్రశంసలు
Iphone 13 Pro Max
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2021 | 12:17 PM

iPhone 13 Pro Max: టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న నిపుణులు వైద్య విధానంలో చరిత్ర సృష్టిస్తున్నారు. మన శరీరభాగాల్లో అని సున్నితమైన కంటికి యాపిల్‌ ఐఫోన్‌13తో వైద్యం చేస్తున్నాడు ఓ వైద్యుడు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఐఫోన్‌తో అద్భుతాలు చేస్తున్నారు ‘టామీ కార్న్’ అనే వైద్యుడు. ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీని ఉపయోగించి కంటిచూపు సమస్యలను ఐఫోన్‌తో పరిష్కరిస‍్తున్నారు. ఇది వినటానికి వింతగా అనిపించినా.. ఆ వైద్యుని వద్ద ఈ ఐఫోన్ చికిత్స తీసుకున్న పేషెంట్లు కూడా తమ చూపు మెరుగైందని చెప్పుకొస్తున్నారు. డాక్టర్ టామీ కార్న్ చేస్తున్న ఈ ఐఫోన్ ఐ చికిత్స గురించి పలువురు నిపుణులు సైతం ఇదొక మెడికల్‌ మిరాకిల్‌ అని అంటున్నారు.

మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి చికిత్స..

డాక్టర్ టామీ కార్న్ ఆప్తమాలజిస్ట్. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందినవారు. ఆయన కార్న్ టెక్సాస్‌ సౌత్‌ వెస్ట్రన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. ఆ తరువాత గత 21 ఏళ్లుగా కంటి వైద్యుడిగా ఎంతోమంది పేషెంట్లు కంటిచూపు మెరుగుపర్చారు. ఆయన చేతులతో ఎన్నో కంటి ఆపరేషన్లు కూడా చేశారు. ప్రస్తుతం ఆయన షార్ప్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్‌ ఇన్నోవేటర్‌(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ టామీ కార్న్ ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి ‘ఐ’ చికిత్స చేస్తు పలువురు పేషెంట్లకు కంటిచూపుని అందించడంతో పాటు పలువురు నిపుణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోలను సైతం క్యాప‍్చర్‌ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్‌ తరువాత వచ్చే కార్నియా రాపిడి సమస్యలకు పరిష్కరిస్తున్నారు. సాధారణ చికిత్సతో చేయలేని పలు సున్నితమైన సమస్యలను మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ తో కంటికి చికిత్స ఎలా చేస్తున్నారో లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు.

మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ అంటే ఏమిటి?..

ఒకప్పుడు ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సి ఉండేది. ఫోటోగ్రఫీ గురించి ఓ ప్రత్యేక ఎడ్యుకేషనే ఉండేది. ఇప్పటికి ఉంది కూడా. కానీ ఇప్పుడలా కాదు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు ఎవ్వరైనా ఫోటోలు తీయచ్చు. అటువంటిది చేతిలో ఐ ఫోన్ ఉంటే ఫోటో స్టైలో వేరు. ఆ ఫోన్‌తో తీసిన ఫోటోల క్లారిటీయే వేరు. అలాబసినిమాటిక్‌ మోడ్‌, మ్యాక్రోమోడ్‌ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు. ఇప్పుడు ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్‌ టామీ కార్నియాకు సంబంధించి కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్‌ ఉన్నా.. మ్యాక్రోమోడ్‌ అనేది వెరీ స్పెషల్. దీంట్లో భాగంగా ఫన్ ఎగ్జాంపుల్..కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని కూడా ఈ అడ్వాన్స్‌డ్‌ మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలను తీయవచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నారు డాక్టర్ టామీ కార్న్.

Iphone

అయితే కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారనే విషయం తెలిసిందే. ఈ కార్నియా చాలా పలచగా అత్యంత సున్నితంగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయటంలో కార్నియాది కీలకపాత్ర వహిస్తుంది. కార్నియా ఆపరేషన్ చాలా సున్నితమైనది కూడా. ఈక్రమంలో కార్నియా ఆపరేషన్‌ చేయించుకున్నన్న ఓ వ్యక్తి సమస్యకు పరిష్కారం చూపారు డాక్టర్ టామీ. సాధారణంగా కార్నియా ఆ ఆపరేషన్‌ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్‌ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్‌ చేశారు.

ఆ తరువాత ఆ సమస్య గురించి డాక్టర్‌ టామీకార్న్‌ సదరు పేషెంట్‌ను అడిగారు. ఇప్పుడెలా ఉంది? అని..దానికి సదరు వ్యక్తి ఇప్పుడు నా కంటిచూపు మెరుగుపడింది..అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ పేషెంట్‌కు అందించిన చికిత్స విధానాన్ని డాక్టర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో దానికి ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌

Business Idea: ఇంజనీర్ల బిర్యానీ పాయింట్.. నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి