Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌

Android Apps: టెక్నాలజీ పెరిగేకొద్ది సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో..

Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌
Follow us

|

Updated on: Oct 05, 2021 | 11:48 AM

Android Apps: టెక్నాలజీ పెరిగేకొద్ది సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మాల్‌వేర్‌లతో దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడేవారినే టార్గెట్‌ చేస్తున్నారు నేరగాళ్లు. ఫేక్ యాప్‌లతో సైబర్ క్రిమినల్స్ అడ్డంగా మోసగిస్తున్నారు. దీనికి సంబంధించి గూగుల్ ఎప్పటికప్పుడు తన యూజర్లను అలర్ట్ చేస్తూనే వస్తోంది. మాల్‌వేర్‌ యాప్స్‌ను ఎప్పటికప్పుడు వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోంది. అలాగే, మొబైల్ యూజర్లు ఒకవేళ తమ ఫోన్ లో వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. 26 అండ్రాయిడ్‌ యాప్స్‌ను బ్యాన్ చేసింది. గ్రిఫ్ట్ హార్స్ అండ్రాయిడ్‌ ట్రోజన్ కలిగివున్న ఆ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే నిలువునా మోసపోతారని హెచ్చరిస్తోంది. 26 యాప్‌ల ద్వారా యూజర్ల డబ్బును హ్యాకర్లు కాజేస్తున్నట్టు గూగుల్ గుర్తించింది.

గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, లాకర్ టూల్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ – ఫైండ్ లొకేషన్, బస్ – మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, మై చాట్ ట్రాన్స్ లేటర్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న యాప్స్‌ను దాదాపు 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ కింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదకరమైన 26 యాప్స్ ఇవే..

1. Handy Translator Pro 2. Heart Rate and Pulse Tracker 3. Geospot: GPS Location Tracker 4. iCare – Find Location 5. My Chat Translator 6. Bus – Metrolis 2021 7. Free Translator Photo 8. Locker Tool 9. Fingerprint Changer 10. Call Recoder Pro 11. Instant Speech Translation 12. Racers Car Driver 13. Slime Simulator 14. Keyboard Themes 15. What’s Me Sticker 16. Amazing Video Editor 17. Safe Lock 18. Heart Rhythm 19. Smart Spot Locator 20. CutCut Pro 21. OFFRoaders – Survive 22. Phone Finder by Clapping 23. Bus Driving Simulator 24. Fingerprint Defender 25. Lifeel – scan and test 26. Launcher iOS 15

ఇవీ కూడా చదవండి:

High Speed Internet: రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లకు భారీ షాక్‌.. డిసెంబర్‌ నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌.. ఏ కంపెనీ అంటే..!

Social Media: సునామీ రాలేదు.. భూకంపం సంభవించలేదు.. ప్రపంచం అల్లాడింది.. ఆ 7గంటల్లో ఏమైందంటే..

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం