High Speed Internet: రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లకు భారీ షాక్‌.. డిసెంబర్‌ నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌.. ఏ కంపెనీ అంటే..!

Elon Musk Starlink: ప్రస్తుతం టెలికాం కంపెనీలో రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌లు దూసుకుపోతున్నాయి. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి..

High Speed Internet: రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లకు భారీ షాక్‌.. డిసెంబర్‌ నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌.. ఏ కంపెనీ అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2021 | 1:03 PM

Elon Musk Starlink: ప్రస్తుతం టెలికాం కంపెనీలో రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌లు దూసుకుపోతున్నాయి. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్‌టెల్‌ వంటి దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే వెలువడుతున్నాయి నివేదికలు. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. ఎలాన్‌ మాస్క్ అటు ముకేశ్ అంబానీకి, ఇటు మిట్టల్‌కు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్‌కు చెందిన స్టార్‌లింక్ అనే శాటిలైట్ కంపెనీ మన దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అంటే 2022 డిసెంబర్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

కంపెనీ ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఊరట కలుగనుందని తెలుస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీంతో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు భారీ షాక్‌ తగలనుంది.

కాగా స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ ఇప్పటికే భారత్‌లో బ్రాడ్‌బాండ్ సేవల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కస్టమర్ల నుంచి 99 డాలర్లు తీసుకుంటోంది. అంటే రూ.7350 చెల్లించాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 50 ఎంబీపీఎస్ నుంచి 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 5 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Google Pay: ఆ సేవలపై వెనుకడుగు వేస్తున్న గూగుల్‌ పే.. ఇలా అయితే బ్యాంకులకు నష్టమే..!

PF UAN Number: ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ (UAN) నెంబర్‌ మర్చిపోయారా..? టెన్షన్‌ వద్దు.. ఇలా చేయండి..!