Maa Elections 2021: మా ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. ఎలా జరగనున్నాయంటే..
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోటీలో
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులు విమర్శలు చేసుకుంటారు. చినుకు చినుకుగా మొదలైన విమర్శలు .. తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా.. అంటూ ఒకరిపై మరొకరి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా.. మా ఎన్నికల్లో రాజకీయం.. సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లింది. ఇప్పటికే జీవితపై మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థి రఘుబాబు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు.. బ్యాలెట్లు దుర్వినియోగం చేస్తున్నారని.. అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ఓకే రకంగా ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలని ఎలక్షన్ ఆఫీసర్‌కి కోరారు.
దీంతో మంచు విష్ణు సైతం ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని కోరారు. అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని..ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని.. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారిని కోరారు. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్‌లో పారదర్శకత ఉంటుందని.. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనదని కోరారు.
ఈ క్రమంలోనే .. మా ఎన్నికలను పోస్టర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రతిపాదనలను కృష్టం రాజు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా బ్యాలెట్ విధానం వైపే మొగ్గు చూపినట్లుగా తెలిపారు. అలాగే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read: Pawan Kalyan: భార్యతో అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్.. దసరాకు చిత్ర యూనిట్ ట్రీట్