Samantha: విడాకుల తర్వాత సమంత ఉండబోయేది అక్కడే..! స్పష్టం చేసిన సామ్..
Samantha: అక్టోబర్ 2వ తేదీన తమ వివాహ బంధానికి సమంతా, నాగచైతన్య ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సమంతా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో
Samantha: అక్టోబర్ 2వ తేదీన తమ వివాహ బంధానికి సమంతా, నాగచైతన్య ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సమంతా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచి వారి సోషల్ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత ఏ పోస్టు చేసినా అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె నుంచి వచ్చే అప్‌డేట్స్ మీద చర్చల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సమంతకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విడాకుల తర్వాత సమంత ఎక్కడుంటుంది అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఈ ఇన్సిడెంట్ తర్వాత తను ఎక్కడ ఉంటాననే దానిపై సమంత స్పష్టమైన వైఖరి తెలియజేసింది. గతంలో ముంబయికి మకాం మార్చేస్తుందని రూమర్స్ వినిపించినప్పటికీ.. ‘‘లేదు.. హైదరాబాద్ నా హోమ్‌టౌన్.. ఇప్పటికీ.. ఎప్పటికీ’’ అని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఫ్లాట్‌లో సమంత నివసించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’, ‘కాతు వక్కుల రెందు కాదల్’ చిత్రాల్లో నటిస్తుండగా.. నాగచైతన్య ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ ‘బంగార్రాజు’ సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల ప్రకటన అనంతరం సైలెంట్ అయిపోయింది.
సామ్-చైతూ విడాకులు తీసుకోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. సమంత, నాగచైతన్య విడిపోవడం పై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. అభిమానులు సైతం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కొన్ని రోజులుగా వీరిద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వచ్చినా వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ వార్తలపై అటు సమంత కుటుంబసభ్యులు గానీ.. ఇటు నాగచైతన్య ఫ్యామిలీ గానీ స్పందించలేదు. కానీ ఆకస్మాత్తుగా తాము విడాకులు తీసుకుంటున్నామని, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించి అందరికి షాకిచ్చారు.