Ap News: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిలీవ్ ప్రక్రియ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు..
Ap News: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. తెలంగాణకు వెళ్లాలని భావిస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసే ప్రక్రియను చేపట్టాలని స
Ap News: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. తెలంగాణకు వెళ్లాలని భావిస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసే ప్రక్రియను చేపట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన ఈ అంశాన్ని మొదటగా ఏపీ ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫార్మ్స్ తీసుకోవాలని సూచించినట్టు ఏపీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి రెడ్డి తెలిపారు. దీనిపై ఒకటి రెండురోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా తమను తెలంగాణకు బదిలీ చేయాలని తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ కుటుంబాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయిని, తాము ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయడం ఇబ్బందిగా ఉందని ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే బదీలి ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించనట్లు తెలుస్తోంది. తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది దీంతో సొంత ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్న ఉద్యోగులకు ఊరట కలగనుంది. కాగా బదిలీ ప్రక్రియపై సీఎం జగన్ స్పందించడంతో తెలంగాణ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.