Vice President Venkaiah Naidu: మనుగడ నుండి అభినృద్ధి వైపు.. వెంకయ్య నాయిడు ప్రారంభించిన యూబీఎఫ్ హెల్ప్ లైన్.. (వీడియో)

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు దీని బారిన పడుతున్నారు. వారిని రక్షించడానికి వైద్య బృందాలు కష్టపడుతూనే ఉన్నాయి. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ గా పిలవబడే ఈ వ్యాధిని నివారించడం కోసం..

Vice President Venkaiah Naidu: మనుగడ నుండి అభినృద్ధి వైపు.. వెంకయ్య నాయిడు ప్రారంభించిన యూబీఎఫ్ హెల్ప్ లైన్.. (వీడియో)

|

Updated on: Oct 06, 2021 | 9:52 PM

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు దీని బారిన పడుతున్నారు. వారిని రక్షించడానికి వైద్య బృందాలు కష్టపడుతూనే ఉన్నాయి. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ గా పిలవబడే ఈ వ్యాధిని నివారించడం కోసం.. దేనిపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. తెలంగాణా రాష్టం హైదరాబాద్ లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ (యూబీఎఫ్) 2007 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన, సహాయం కోసం పనిచేస్తోంది. ఈ సంస్థ రొమ్ము క్యాన్సర్ లేదా రొమ్ము సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికోసం ”యూబీఎఫ్ హెల్ప్” అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీనిని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

యూబీఎఫ్ హెల్ప్ అనేది జాతీయ స్థాయిలో రొమ్ము క్యాన్సర్ అలాగే రొమ్ము సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ఏర్పాటయిన మొట్టమొదటి ఛారిటీ హెల్ప్ లైన్. దీని ద్వారా ఉచిత సేవలు లభిస్తాయి.

ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ (యూబీఎఫ్) వార్షిక సమావేశాల్లో భాగంగా ఈ ప్రత్యెక హెల్ప్ లైన్ ప్రారంభించినట్టు యూబీఎఫ్ వ్యవస్థాపక సీయీవో డైరెక్టర్ డాక్టర్ పి.రఘురాం చెప్పారు. ఇక ఎవరైనా రొమ్ము క్యాన్సర్ తో లేదా రొమ్ము సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నట్టయితే తమ ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 08046983383 ద్వారా తమను సంప్రదించి సహాయం పొందవచ్చని ఆయన వెల్లడించారు. ఇక తమ వార్షిక సమావేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఇబ్బందులను గురించి.. వాటిని ఎదుర్కునే తీరుతెన్నుల గురించి నిపుణులు మాట్లాడతారని వివరించారు.

కాగా, ఐసిఎంఆర్ 2020 నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో 30-40 వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌కి గురవుతున్నారు. అవగాహన లేకపోవడంతో రోగ నిర్ధారణకు ఆలస్యమవుతుంది. ఇది మరణాల రేటుకు కారణమవుతుంది. చాలావరకు రొమ్ము క్యాన్సర్ బాధితులను అభివృద్ధి చెందుతున్న దశలో గుర్తించారు. ఈ పరిస్థితికి కారణం అవగాహన లేకపోవడమే. ఇటువంటి అవగాహనా లోపాలను ఎదుర్కునే దిశలో యూబీఎఫ్ కృషి చేస్తోంది. అందుకోసమే ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ప్రారంభించింది.


మరిన్ని చదవండి ఇక్కడ : Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. విష్ణు ప్రియ.. ప్రూఫ్ ఇదిగో.. (వీడియో)

 Allu Arjun-Allu Ramalingaiah: తాతపై ఉన్న ప్రేమను.. బన్నీ ఇలా బయటపెట్టాడు.. చరిత్రలో నిలిచిపోయేలా..(వీడియో)

 Kerala Old Lady Video: సూపర్ ఉమెన్.. 73 ఏళ్ల వయసులో.. వీరులనే మట్టి కరిపిస్తోంది.. ఈ బామ్మ మాముల్ది కాదు గా..(వీడియో)

 Terrible bird Video: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి.. షాకింగ్ వీడియో చుస్తే షాక్ అవుతారు..

Follow us