Allu Arjun-Allu Ramalingaiah: తాతపై ఉన్న ప్రేమను.. బన్నీ ఇలా బయటపెట్టాడు.. చరిత్రలో నిలిచిపోయేలా..(వీడియో)
Allu Arjun-Allu Ramalingaiah: తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటులు అల్లు రామలింగయ్య. వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోశారు. తనదైన కామెడీతో టాలీవుడ్‌లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
Allu Arjun-Allu Ramalingaiah: తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటులు అల్లు రామలింగయ్య. వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోశారు. తనదైన కామెడీతో టాలీవుడ్‌లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అందుకే భారత ప్రభుత్వం అల్లు రామలింగయ్యను పద్మశ్రీ అవార్డు తో గౌరవించింది. హోమియోపతి వైద్యాన్ని అభ్యసించి, చుట్టూ ఉన్న వారికి తగిన వైద్యం అందిస్తూ, మరోవైపు నాటకాలు వేశారు అల్లు రామలింగయ్య. ‘పుట్టిల్లు’ అనే సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయం అయిన ఈయన దాదాపు అందరు బడా హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
ఇక అల్లు వారసునిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లుఅరవింద్ సినిమా నిర్మాణరంగంలో తన ముద్రవేయగా.. ఆయన మనవళ్లు అల్లు అర్జున్, శిరీష్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు అల్లుని స్మరించుకున్నారు. అయితే రామలింగయ్య మనవళ్లు వెంకటేశ్, అర్జున్, శిరీష్‌లు తమ తాత జ్ఙాపకార్థం తాము కొత్తగా నిర్మిస్తున్న స్టూడియోలో రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని బన్నీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంలో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ రోజు మా తాత పద్మశ్రీ రామలింగయ్య గారి జయంతిన వారి విగ్రహాన్ని ఆవిష్యరించాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు వెంకటేశ్, శిరీష్ పాల్గొన్నారు. ఆయన మా గర్వకారణం, అల్లు స్టూడియోస్ నిర్మాణ ప్రయాణంలో తోడుగా ఉంటారు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Kerala Old Lady Video: సూపర్ ఉమెన్.. 73 ఏళ్ల వయసులో.. వీరులనే మట్టి కరిపిస్తోంది.. ఈ బామ్మ మాముల్ది కాదు గా..(వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

