Married to Cooker Viral Video: విచిత్రమైన పెళ్లి.. రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకున్న ఆనం.. వైరల్ అవుతున్న వీడియో..
మనం ఓ సినిమాలో సరదా సన్నివేశంలో కమెడియన్‌కి గాడిదను ఇచ్చి పెళ్లి చేయడం చూశాం. ఇంకా జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టుకోడానికి చెట్లకు, మనుషులకు వివాహాలు చేయడం కూడా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వింత వివాహం చేసుకున్నాడు.
మనం ఓ సినిమాలో సరదా సన్నివేశంలో కమెడియన్‌కి గాడిదను ఇచ్చి పెళ్లి చేయడం చూశాం. ఇంకా జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టుకోడానికి చెట్లకు, మనుషులకు వివాహాలు చేయడం కూడా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వింత వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లు, లైక్‌లతో హోరెత్తిస్తున్నారు.
ఇండోనేషియాకు చెందిన ఆనం అనే ఓ వ్యక్తి రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌లో వరుడు మెరిసిపోయాడు, అంతేకాదు వధువుగా రైస్ కుక్కర్‌ను వైట్ డ్రెస్‌తో అందంగా ముస్తాబు చేశాడు. పెళ్లి అనంతరం తన కుక్కర్ భార్యతో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. తమ పెండ్లికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన పత్రాలపై పెండ్లికొడుకు ఆనం సంతకాలు చేస్తూ ఓ ఫోటోలో సందడి చేశాడు. మరో ఫొటోలో రైస్ కుక్కర్‌ను కిస్ చేస్తూ రొమాంటిక్ పోజిచ్చాడు. ఈ ఫొటోలకు “వైట్..క్వైట్..పర్ఫెక్ట్..వెరీ డ్రీమీ” అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. సెప్టెంబర్ 20న కుక్కర్‌తో తన పెండ్లిని ప్రకటిస్తూ ఆనం ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలకు 44 వేలకు పైగా లైక్‌లు, లక్షా 35 వేల రీట్వీట్‌లు వచ్చాయి. అయితే ఆనం తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. రైస్ కుక్కర్ అన్నం మాత్రమే సరిగి వండుతోంది.. మిగతా వంటలు సరిగా చేయడం లేదని, అందుకే తనకు విడాకులు ఇస్తున్నానని ప్రకటించాడు. అయితే కుక్కర్‌తో పెళ్లి, విడాకులు అన్నీ సరదాకోసం చేసినవే అట.. నిజం కాదట..
మరిన్ని చదవండి ఇక్కడ : Idli Viral Video: ఓ రెస్టారెంట్ వినూత్న ఆలోచన.. మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న కొత్త ఇడ్లీలు(వీడియో)
Naga Chaitanya Video: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది..! వైరల్ గా మారిన నాగచైతన్య ట్వీట్..(వీడియో)
Ek Number News: గామె చేయవట్టే ఫేస్‌బుక్ బందయ్యిందట! | సర్కార్ బడిల మాట్లాడే పెన్నులు..(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

