Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idli Viral Video: ఓ రెస్టారెంట్‌ వినూత్న ఆలోచన.. మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న కొత్త ఇడ్లీలు(వీడియో)

Idli Viral Video: ఓ రెస్టారెంట్‌ వినూత్న ఆలోచన.. మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న కొత్త ఇడ్లీలు(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 05, 2021 | 8:12 PM

ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఆ మజానే వేరు. ఎక్కువ మంది ఇష్టపడి తినే టిఫిన్స్‌లో ఇడ్లీ మొదటి స్థానంలో ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలను చెట్నీ లేదా సంబారులో ముంచుకొని తింటే ఆ కిక్కే వేరని భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే

ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఆ మజానే వేరు. ఎక్కువ మంది ఇష్టపడి తినే టిఫిన్స్‌లో ఇడ్లీ మొదటి స్థానంలో ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలను చెట్నీ లేదా సంబారులో ముంచుకొని తింటే ఆ కిక్కే వేరని భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటి వరకూ మనం తెల్లని, గుండ్రని ఇడ్లీలను లొట్లలేసుకుంటూ తిన్నాం కదా.. ఇప్పడు కాస్త వెరైటీ షేప్‌లో ఉండే ఇడ్లీలు తినబోతున్నారు. ఇడ్లీలకు షేప్‌ ఏంటి అనుకుంటున్నారా.. అయితే చూడండి..

బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌ వాళ్లు రోజూ గుండ్రని ఇడ్లీలు చేసి..చేసి బోర్‌ కొట్టినట్లుంది.. ఇడ్లీలు గుండ్రగానే ఎందుకుండాలి అనుకున్నట్లున్నారు వాటి షేప్‌నే మార్చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రకం ఇడ్లీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ రెస్టారెంట్‌ వాళ్లు కస్టమర్లను ఆకర్షించడానికి వినూత్న ప్రయత్నం చేశారు. సాధారణంగా గుండ్రంగా ఉండే ఇడ్లీలను పుల్ల ఐస్‌ రూపంలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇడ్లీ పిండికి ఐస్‌క్రీమ్‌ పుల్లను జోడించి.. అచ్చంగా పుల్ల ఐస్‌ రూపంలో తయారు చేశారు. ఈ వెరైటీ ఇడ్లీలను కొందరు ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు రెస్టారెంట్‌ నిర్వాహకుల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ఏదేమైనా కస్టమర్లను అట్రాక్ట్‌ చేయడం కోసం చేసిన ఈ కొత్త రకం ఇడ్లీలు నిజంగానే వావ్‌ అనిపిస్తున్నాయి. మరి ఈ పుల్ల ఐస్‌ ఇడ్లీలపై మీరూ ఓ లుక్కేయండి..
మరిన్ని చదవండి ఇక్కడ : Naga Chaitanya Video: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది..! వైరల్ గా మారిన నాగచైతన్య ట్వీట్..(వీడియో)

 Big News Big Debate: ప్రకాష్‌రాజ్‌ ఫ్రస్టేషన్ పీక్‌కి చేరిందా.? తమిళరాష్ట్రం తరిమేస్తే తెలుగులో రచ్చ చేస్తున్నారా?(లైవ్ వీడియో)

 Ek Number News: గామె చేయవట్టే ఫేస్‌బుక్‌ బందయ్యిందట! | సర్కార్‌ బడిల మాట్లాడే పెన్నులు..(వీడియో)

 వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..: Konda Polam movie Pre Release Event live video