నవ్వుతో 40 రకాల లాభాలు.. నిత్య యవ్వనంగా ఉండాలంటే నవ్వుతూ ఉండండి.. వీడియో

నవ్వుతో 40 రకాల లాభాలు.. నిత్య యవ్వనంగా ఉండాలంటే నవ్వుతూ ఉండండి.. వీడియో

Phani CH

|

Updated on: Oct 06, 2021 | 8:12 AM

నవ్వు నాలుగు రకాల చేటు అనేది ఒకప్పటి నానుడి.. నవ్వు నలభై రకాల లాభం అన్నది నేటి మాట. నవ్వు విలువ తెలియక చాలామంది ఎప్పుడూ గంభీరంగా, కోపంగా ఉంటారు.

నవ్వు నాలుగు రకాల చేటు అనేది ఒకప్పటి నానుడి.. నవ్వు నలభై రకాల లాభం అన్నది నేటి మాట. నవ్వు విలువ తెలియక చాలామంది ఎప్పుడూ గంభీరంగా, కోపంగా ఉంటారు. కానీ ఒక్క చిరునవ్వు ఎంత ఆరోగ్యాన్నిస్తుందో తెలిస్తే ఇంకెప్పుడూ సీరియస్‌గా ఉండరు. ఈ నవ్వుకు సంబంధించి ఒక స్పెషల్‌ డే కూడా ఉంది.. అదే ప్రతి ఏడాదీ అక్టోబరులో వచ్చే మొదటి శుక్రవారం. ఈ స్మైల్ డేను తొలిసారిగా 1999లో అమెరికన్ ఆర్టిస్ట్ హార్వే బాల్ ప్రారంభించారు. ఒక్క చిరునవ్వు ఎంతటి ఒత్తిడినైనా పటాపంచలు చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక్క చిరునవ్వు మన శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండె కదలికలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మనతోపాటు, మనచుట్టూ ఉన్నవారిని కూడా సంతోషకరంగా ఉండేలా చేస్తుంది. ఇంకో విషయం తెలుసా.. ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉండేవారు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారట. అంతేకాదు ఆరోగ్యపరంగా నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుందట. నవ్వుతూ ఉండటం వలన సాధారణ జలుబు, ఫ్లూనుంచి సులువుగా బయటపడవచ్చట.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ ఛార్జర్‌.. 3 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే చాలు.. 100 కి.మీ. ప్రయాణించొచ్చు! వీడియో

Allu Aravind-CM Jagan: తులచుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు.. జగన్‌కు అరవింద్‌ స్వీట్ రిక్వెస్ట్..(వీడియో)