RR vs MI: ముంబై ఇండియన్స్ ఆశలు సజీవం.. రాజస్థాన్‌పై రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం..
RR vs MI: ప్లే ఆఫ్ రేస్ కోసం ఈరోజు షార్జాలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబై ఘన విజయం
RR vs MI: ప్లే ఆఫ్ రేస్ కోసం ఈరోజు షార్జాలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబై ఘన విజయం సాధించింది. ఫ్లే ఆఫ్ ఆశలు సజీవంగా కాపాడుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్ ఆశించినంతగా రాణించలేకపోయింది. ముంబై బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రావడం, వెళ్లడం పరిపాటుగా మారిపోయింది. దీంతో ముంబై దాటికి రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ లూయిస్ (24), జైస్వాల్ (12) మంచి ఆరంభం ఇచ్చినా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మొత్తం ఇన్నింగ్స్‌లో లూయిస్ చేసిన 24 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్ 4 వికెట్లు, జిమ్మీ నీషమ్ 3 వికెట్లు, బుమ్రా2 వికెట్లు సాధించారు. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై అలవోకగా లక్ష్యాన్ని ఛేధించింది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 25 బంతుల్లో 50 పరుగులు (3 సిక్స్‌లు, 5 ఫోర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 22 పరుగులు, సూర్యకుమార్ 13 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫికర్ రెహ్మాన్, చేతన్ సకారియా తలో వికెట్ సాధించారు.