IPL 2021: చెత్త రికార్డ్‌ని మూటగట్టుకున్న రాజస్థాన్ రాయల్స్.. గతంలో కూడా ఇదే జరిగింది..
IPL 2021: ఐపీఎల్ 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఇందులో ముంబై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
IPL 2021: ఐపీఎల్ 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఇందులో ముంబై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ముంబై బౌలర్ల దాటికి విలవిలలాడింది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో ఐపిఎల్ హిస్టరీలో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం తొమ్మిది వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైలు నాలుగు, జిమ్మీ నీషమ్ మూడు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు సాధించారు.
రాజస్థాన్ రాయల్స్ మూడో అత్యల్ప స్కోరు ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐపిఎల్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అంతకుముందు రాజస్థాన్ జట్టు అత్యల్ప స్కోరు 58 పరుగులు. 2009 ఐపిఎల్‌లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు మాత్రమే చేసింది.
రెండో అత్యల్ప స్కోరు.. ఇది కాకుండా రాజస్థాన్ రెండో అత్యల్ప స్కోరు 81 పరుగులు. 2011 ఐపిఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 81 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో అత్యల్ప స్కోరు అక్టోబర్ 5 , 2021న షార్జా మైదానంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చేసింది. 20 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఫ్లే ఆఫ్ రేసుకోసం జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం వల్ల రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా టోర్ని నుంచి నిష్క్రమించినట్లే. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య గతంలో 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై టీం 12 విజయాలతో ముందుంది. రాజస్థాన్ టీం 11 విజయాలు సాధించింది. అయితే తాజాగా మరో విజయం ముంబై ఖాతాలో కలిసింది.