IPL 2021 RR vs MI: చేతులెత్తేసిన రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌.. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోర్‌..

RR vs MI 1st Innings Update: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించడంతో...

IPL 2021 RR vs MI: చేతులెత్తేసిన రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌.. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 05, 2021 | 9:25 PM

RR vs MI 1st Innings Update: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించడంతో ముంబయి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్‌ జరిగిన తీరు చూస్తే ముంబయి తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించకమానదు. ముంబయి బౌలర్ల దాటికి రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి రావడం, వెళ్లడం పరిపాటుగా మారిపోయింది. దీంతో ముంబయి దాటికి రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే సాధించింది. ప్రస్తుతం ముంబయి గెలవాలంటే 91పరుగులు చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్స్‌ లూయిస్‌ (24), జైస్వాల్‌ (12) మ్యాచ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్‌లో జైస్వాల్‌ వెనుతిరగడంతో రాజస్థాన్‌ కష్టాలు మొదలయ్యాయి. ఆ వెంటనే లూయిస్‌ అవుట్‌ అయ్యాడు. ఇలా వరుస వికెట్లు కోల్పోయి రాజస్థాన్‌ తీవ్ర కష్టాల్లోకి కూరుకుపోయింది.

ఒకానొక సమయంలో 50 పరుగులకు 5 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత కాస్త మ్యాచ్‌ గాడిన పడుతుందనుకునే సమయంలో ముంబయి బౌలర్ల దాటికి రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. బ్యాట్స్‌మెన్‌లు క్రీజులోకి రావడం వెళ్లి పోవడం జరిగింది. మొత్తం ఇన్నింగ్స్‌లో లూయిస్‌ చేసిన 24 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. మరి బ్యాటింగ్‌ విఫలమైన రాజస్థాన్‌ బౌలింగ్‌ ముంబయిని కట్టడి చేస్తుందో చూడాలి.

Also Read: Flipkart Big Billion sale: యాక్సిస్‌ బ్యాంకు పండుగ బొనాంజా.. ఆన్‎లైన్ షాపింగ్ చేస్తే 45 శాతం వరకు క్యాష్‎బ్యాక్..!

Sidhu Resign: సిద్ధూ రాజీనామా ఆమోదించే దిశలో కాంగ్రెస్ అధిష్టానం.. ఢిల్లీ వెళ్ళిన పంజాబ్ సీఎం చరంజిత్ చన్నీ!

Pawan Kalyan: భార్యతో అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్.. దసరాకు చిత్ర యూనిట్ ట్రీట్