T20 World Cup: ఇంగ్లాండ్‌కు పెద్ద షాక్.. జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్.. అందుకేనా..
2019 వన్డే ప్రపంచకప్ గెలిచి.. టీ20 ప్రపంచకప్ గెలుద్దామనుకున్నఇంగ్లాండ్కు పెద్ద షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ టోర్నికి దూరమయ్యాడు.
2019 వన్డే ప్రపంచకప్ గెలిచి.. టీ20 ప్రపంచకప్ గెలుద్దామనుకున్నఇంగ్లాండ్కు పెద్ద షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ టోర్నికి దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ తాజాగా సామ్ కరన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను కోల్పోవడం పెద్ద దెబ్బే అని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్-2021లో సీఎస్‌కే తరపున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు తెలిపింది. టి20 ప్రపంచకప్ 2021 యూఏఈ, ఒమన్ జరగనుంది. అక్టోబర్ 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 14 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్,టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్.
Speedy recovery, @CurranSM ?#T20WorldCup squad update ⬇️
— England Cricket (@englandcricket) October 5, 2021