IPL 2021 RR vs MI Match Highlights : రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్

Narender Vaitla

| Edited By: uppula Raju

Updated on: Oct 05, 2021 | 10:44 PM

Rajasthan Royals vs Mumbai Indians Highlights : ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఫ్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకునే జట్టు ఏదో మరికాసేపట్లో...

IPL 2021 RR vs MI Match Highlights : రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్
RR vs MI IPL 2021

Rajasthan Royals vs Mumbai Indians Highlights : ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఫ్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకునే జట్టు ఏదో మరికాసేపట్లో తేలిపోనుంది. ఈ ఆసక్తికరమైన మ్యాచ్‌కు షార్జా స్టేడియం వేదికవుతోంది. రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబయి ఇండియన్స్‌ బరిలోకి దిగనున్న ఈ పోరులో ఏ జట్టు ఓడిపోతే ఆ టీమ్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై టీం 12 విజయాలతో కొంచెం ముందుంది. రాజస్థాన్ టీం 11 విజయాలు సాధించింది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రస్తుతం విజయంతో జోష్‌లో ఉండగా, ముంబయి ఇండియన్స్‌ మాత్రం పరాజయంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలవాలనే కసిగా ఉంది. ఇలా రెండు జట్లు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారనుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన రాజస్తాన్ ఆశించినంతగా రాణించలేకపోయింది. ముంబై బౌలర్ల దాటికి రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి రావడం, వెళ్లడం పరిపాటుగా మారిపోయింది. దీంతో ముంబై దాటికి రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే సాధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్స్‌ లూయిస్‌ (24), జైస్వాల్‌ (12) మంచి ఆరంభం ఇచ్చినా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవ్వరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మొత్తం ఇన్నింగ్స్‌లో లూయిస్‌ చేసిన 24 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్‌ 4 వికెట్లు, జిమ్మీ నీషమ్‌ 3 వికెట్లు, బుమ్రా2 వికెట్లు సాధించారు. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై అలవోకగా లక్ష్యాన్ని ఛేధించింది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 25 బంతుల్లో 50 పరుగులు (3 సిక్స్‌లు, 5 ఫోర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 22 పరుగులు, సూర్యకుమార్ 13 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫికర్ రెహ్మాన్, చేతన్ సకారియా తలో వికెట్ సాధించారు.

ఇరు జట్ల ప్లేయర్స్‌..

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహమాన్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, జేమ్స్‌ నీషమ్‌, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Oct 2021 10:05 PM (IST)

    6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ముంబయి స్కోర్‌ ఎంతంటే..

    ముంబయి దూకుడుగా ఆడుతోంది. విజయానికి కేవలం 35 పరుగుల దూరంలో ఉంది. 84 బంతుల్లో 35 పరుగులు చేస్తే ముంబయి గెలుస్తుంది. ఇక ప్రస్తుతం క్రీజులో ఇషాన్‌ కిషన్‌ (20), హార్ధిక్‌ పాండ్యా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 05 Oct 2021 09:53 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన ముంబయి..

    పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌కు తొలి దెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేతన్‌ సకారియా విసిరిన బంతికి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చిన రోహిత్‌ అవుటయ్యాడు. అయితే కేవలం 13 బంతుల్లోనే 22 పరుగులు సాధించిన రోహిత్‌ జట్టు స్కోరు ఒక్కసారిగా పెరగడానికి కారణమయ్యాడు.

  • 05 Oct 2021 09:40 PM (IST)

    ముంబయి శుభారంభం..

    రాజస్థాన్‌ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ముంబయికి మంచి ఆరంభం లభించింది. తొలి ఓవర్‌లోనే 14 పరుగులు సాధించింది. రోహిత్‌ శర్మ 1 ఫోర్‌ 1 సిక్స్‌తో చెలరేగాడు.

  • 05 Oct 2021 09:29 PM (IST)

    కుప్పకూలిన రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ లైనప్‌..

    కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ముంబయి బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ లైనప్‌ కుప్పకూలి పోయింది. 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులకు మాత్రమే పరిమితమైంది. రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌లో లూయిస్‌ ఒక్కడు మాత్రమే 24 పరుగులు చేశాడు. 7గురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కు మాత్రమే పరిమితమవడం గమనార్హం. ముంబయి విజయానికి కేవలం 91 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.

  • 05 Oct 2021 09:02 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ తీవ్ర కష్టాలోకి వెళుతోంది. వరుస వికెట్లకు అడ్డుకట్ట పడుతుందనుకుంటున్న సమయంలో రాహుల్ తెవాటియా రూపంలో రాజస్థాన్‌కు మరో దెబ్బ తగిలింది. 12 పరుగుల వద్ద రాహుల్‌ జేమ్స్‌ నీషమ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెను తిరిగాడు. ఇక అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ గోపాల్‌ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 05 Oct 2021 08:45 PM (IST)

    చెలరేగుతోన్న ముంబయి బౌలర్లు..

    ముంబయి బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ జట్టు స్కోరు ముందుకు సాగడంలేదు. 12వ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 13వ ఓవర్‌లోనూ రాజస్థాన్‌కు బౌండరీలు సాధ్యంకాలేదు. కేవలం ఆరు పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 62 పరుగులతో కొనసాగుతోంది.

  • 05 Oct 2021 08:38 PM (IST)

    11 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోర్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడుతుండడంతో జట్టు స్కోరు బాగా నెమ్మదించింది. 11 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 54 పరుగుల చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (2), మిల్లర్‌ (4) పరుగులతో కొనసాగిస్తున్నారు.

  • 05 Oct 2021 08:33 PM (IST)

    రాజస్థాన్‌కు మరో దెబ్బ..

    ఆరంభం భాగానే ఉన్నా తర్వాత రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమవుతున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ వికెట్లు కోల్పోతూ జట్టు స్కోరు భారీగా నెమ్మదించింది. తాజాగా నాథన్ కౌల్టర్-నైల్ విసిరిన బంతికి ఫిలిప్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో రాజస్థాన్‌ తీవ్ర కష్టాల్లోకి కూరుకుపోయింది. పది ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి 50 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 05 Oct 2021 08:27 PM (IST)

    కష్టాల్లోకి రాజస్థాన్‌.. నాలుగో వికెట్‌ కూడా పోయింది.

    రాజస్థాన్‌ రాయల్స్‌ క్రమంగా కష్టాల్లోకి చేరుకుంటోంది. వరుస వికెట్లు కోల్పోవడంతో జట్టు స్కోరు ఒక్కసారిగా పడిపోయింది. జేమ్స్‌ నీషమ్‌ విసిరిన బంతికి శివమ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ 9 ఓవర్లు ముగిసే సమయానికి 49 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో మిల్లర్‌ (1), పిలిప్స్‌ (4) పరుగులతో ఉన్నారు.

  • 05 Oct 2021 08:21 PM (IST)

    8 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ స్కోర్‌..

    మొదట్లో దూకుడుగా ఆడిన రాజస్థాన్‌ ఆ తర్వాత కాస్త తడబడింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్‌ స్కోరు కాస్త నెమ్మదించింది. 8 ఓవర్‌లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ (3), శివమ్‌ దుబే (03) పరుగులతో ఉన్నారు. మరి వీరిద్దరిలో జట్టు స్కోరును పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి.

  • 05 Oct 2021 08:12 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌..

    ఆరంభంలో బాగా రాణించిన రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఆ తర్వాత వెంటవెంటనే వెనుతిరుగుతున్నారు. లూయిస్‌ అవుట్‌ కొన్ని క్షణాలకే సంజూ సామ్సన్‌ వెనుతిరిగాడు. జేమ్స్‌ నీషమ్‌ వేసిన ఓవర్‌లో తొలి బంతికే జయంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 05 Oct 2021 08:07 PM (IST)

    రాజస్థాన్‌కు మరో దెబ్బ.. డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ అవుట్‌.

    రాజస్థాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. 19 బంతుల్లో 24 పరుగులు చేసి దూకుడుగా ఆడుతోన్న లూయిస్‌, బుమ్రాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో రాజస్థాన్‌ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులోకి శివమ్‌ దూబే వచ్చాడు.

  • 05 Oct 2021 07:57 PM (IST)

    నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ స్కోర్..

    నాలుగో ఓవర్‌లో రాజస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఇక నాలుగు ఓవర్‌లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 1 వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సామ్‌సన్‌ (1), లూయిస్‌ (18) పరుగులతో ఉన్నారు.

  • 05 Oct 2021 07:55 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ జట్టుకు తొలి దెబ్బ తగిలింది. బాగా ఆడుతున్నారని అనుకుంటున్న సమయంలోనే యశస్వి జైస్వాల్‌ అవుట్‌ అయ్యాడు. నాథన్ కౌల్టర్-నైల్ విసిరిన బంతిలో షాట్‌కు ప్రయత్నించిన జైస్వాల్‌.. కీపర్‌ ఇషాన్‌ కిషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 05 Oct 2021 07:49 PM (IST)

    మూడు ఓవర్లుకు రాజస్థాన్‌ స్కోర్‌ ఎంతంటే..

    రాజస్థాన్‌ రాయల్స్‌కు మంచి ఆరంభం లభించిందని చెప్పాలి. బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతూ పవర్‌ ప్లేను బాగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఎలాంటి వికెట్లు కోల్పోకుండా 26 పరుగులు సాధించారు. ప్రస్తుతం లూయిస్‌ (13), జైశ్వాల్‌ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 05 Oct 2021 07:45 PM (IST)

    రాజస్థాన్‌కు బిగ్‌ ఓవర్‌..

    రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి. వీటిలో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు ఉండడం విశేషం. రెండు ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ రాయల్స్‌ 21 పరుగులతో ఉంది. ప్రస్తుతం క్రీజులో లూయిస్‌ 12, జైశ్వాల్‌ 12 పరుగులతో ఉన్నారు.

  • 05 Oct 2021 07:43 PM (IST)

    పవర్‌ హిట్‌.. సిక్సుతో బాదిన లూయిస్‌.

    రెండో ఓవర్‌ రెండో బంతికి లూయిస్‌ సిక్స్‌ బాదాడు. జయంత్‌ వేసిన స్పిన్‌ బౌలింగ్ స్ట్రెయిట్‌ డ్రైవ్‌లో సింపుల్‌గా బంతిని బౌండరీ బయట వేశాడు లూయిస్‌.

  • 05 Oct 2021 07:36 PM (IST)

    బౌండరీతో మొదలు పెట్టిన జైశ్వాల్‌..

    టాస్‌ ఓడి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన రాజస్థాన్‌ తొలి ఓవర్‌లో 6 పరుగులు చేసింది. ఇక యశశ్వీ జైస్వాల్‌ తొలి బంతినే బౌండరీతో మొదలుపెట్టాడు.

  • 05 Oct 2021 07:19 PM (IST)

    ఇరు జట్ల ప్లేయర్స్‌..

    రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహమాన్

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, జేమ్స్‌ నీషమ్‌, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

  • 05 Oct 2021 07:09 PM (IST)

    టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి..

    అటు రాజస్థాన్‌కు, ఇటు ముంబయికు చావో రేవో అన్నట్లు మారిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచారు. అయితే ముంబయి మొదట బౌలింగ్‌ను ఎంచుకోవడం విశేషం. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. మరి ముంబయి తీసుకున్న ఈ నిర్ణయం ఏమేర ఫలిస్తుందో చూడాలి.

  • 05 Oct 2021 06:55 PM (IST)

    మీకు తెలుసా?

    * ఆర్ఆర్‌కి వ్యతిరేకంగా రోహిత్ రికార్డ్ మామూలుగానే ఉంది. ఓపెనర్ 16 ఇన్నింగ్స్‌లలో 18.38 సగటుతో కేవలం 294 పరుగులు సాధించాడు. 120.99 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. * ఇక ఐసీఎల్ 2021 రెండో దశలో స్పిన్నర్‌లపై ఎంఐ స్కోరింగ్ రేటు 6.11 rpoగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే 6.05 పరుగుల రేటుతో అధ్వాన్నంగా ఉంది.

Published On - Oct 05,2021 6:48 PM

Follow us