Raashi Khanna: ఆ ముగ్గురు హీరోలంటే చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..
తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది.
Raashi Khanna: తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇక ఈ అమ్మడు తెలుగు సినిమాలతోపాటు తమిళ్‌లోనూ చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే తమిళ నట అడుగు పెట్టిన ఈ బబ్లీ బ్యూటీ ‘అరణ్మనై 3’ .. ‘సర్దార్’ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే తమిళ్‌లోనూ రాశికన్నా హవా నడుస్తుంది. ఈ సినిమాలతోపాటు రాశిఖన్నా చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇలా మొత్తం తమిళ్ లో 5 సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. అలాగే తెలుగులోనూ రాశిఖన్నా జోరు ఏమాత్రం తగ్గలేదు.. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా చేస్తుంది రాశి ఖన్నా.. ఈ సినిమాకు విక్రమ్ కుమార్. కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
అలాగే మారుతి దర్శకత్వంలో గోపిచంద్ నటిస్తున్న పక్కకమర్షియల్ సినిమాలో చేస్తుంది రాశి. మారుతి గతంలో తెరకెక్కించిన ప్రతిరోజు పండగే సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుంటుంది. ఇదిలా ఉంటే తెలుగు రాశిఖన్నా కు ఇష్టమైన హీరోలు ఎవరనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో రాశి స్పందిస్తూ.. హీరోలందరూ నాకు ఇష్టమే. వారిలో ఎక్కువగా ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ అంటే మరింత ఇష్టం. అంటూ చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్లలో అనుష్క .. సమంత అంటే ఎక్కువ ఇష్టం అని అంటుంది రాశి.
మరిన్ని ఇక్కడ చదవండి :