AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Trivedi Passed Away: రావణుడు ఇక లేడు.. తుది శ్వాస విడిచిన అరవింద్ త్రివేది

రామానంద్ సాగర్ 'రామాయణం'లో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. అరవింద్ వయస్సు 82 సంవత్సరాలు. అరవింద్ త్రివేది మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు.

Arvind Trivedi Passed Away: రావణుడు ఇక లేడు.. తుది శ్వాస విడిచిన అరవింద్ త్రివేది
Ravana
Sanjay Kasula
|

Updated on: Oct 06, 2021 | 9:18 AM

Share

రామానంద్ సాగర్ ‘రామాయణం’లో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. అరవింద్ వయస్సు 82 సంవత్సరాలు. అరవింద్ త్రివేది మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. అరవింద్ గత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మంగళవారం అర్థరాత్రి గుండెపోటు వచ్చిందని అరవింద్ త్రివేది మేనల్లుడు కౌష్తుబ్ త్రివేది తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారని కౌష్తుబ్ వెల్లడించారు.

గత కొద్ది కాలంగా అరవింద్ త్రివేది ఆరోగ్యం సరిగా లేదని.. అయితే  మంగళవారం గుండెపోటు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత అతని అవయవాలు చాలా వరకు పనిచేయడం మానేశాయని ఆయన చెప్పారు. అరవింద్ త్రివేది అంత్యక్రియలు బుధవారం ముంబైలోని కాండివాలి వెస్ట్‌లో ఉన్న శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతాయన్నారు.

రావణుడి పాత్రతో అరవింద్ పాపులర్ అయ్యారు

ఆబాలగోపాలాన్ని అలరించిన ధారావాహిక రామానంద్ సాగర్ రామాయణంలో రావణుడి పాత్రను అరవింద్ త్రివేది పోషించారు. రావణుడి పాత్రతో చాలా ప్రసిద్ధి పొందారు. అరవింద్ త్రివేది గొంత కూడా రావణుడి పాత్రకు సరిగ్గా సరిపోయింది. అతని ముందు మిగతా నటులు చాలా సాఫ్ట్‌గా కనిపించేవారు. అంతే ఇప్పటికీ టీవీలో బిగ్గరగా వాయిస్ వినిపించిందంటే చాలా.. అది అరవింద్ త్రివేది గొంతు అంటూ గుర్తు పట్టేస్తారు.  

టీవీలో రామాయణం వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు తమ అభిమాన రావణుడిని చూడటానికి టీవీ ముందు కూర్చుంటారు. రామానంద్ సాగర్ రామాయనంలో రావణ పాత్ర ద్వారా అరవింద్ త్రివేది ప్రజాదరణ పొందారు. ఢిల్లీ రామ్ లీలాలో జరిగే రామాయణంలో పాత్ర పోషించే వ్యక్తి అరవింద్ త్రివేదిని అనుకరిస్తుంటారు. 

భారతీయ టెలివిజన్ ఈ ఐకానిక్ పాత్రను పోషించడమే కాకుండా అరవింద్ త్రివేది.. కల్ట్ టీవీ షో విక్రమ్, బేతాల్‌లో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇది మాత్రమే కాదు.. అరవింద్ త్రివేది తన నటనతో మూడు దశాబ్దాలపాటు గుజరాతీ ప్రేక్షకులను మెప్పించారు. దేశ్ రే జోయా దాదా పరదేష్ జోయా అరవింద అత్యంత ప్రజాదరణ పొందిన గుజరాతీ చిత్రాలలో ఒకటి. అరవింద్ త్రివేది సోదరుడు ఉపేంద్ర కూడా గుజరాతీ సినిమాలో సుపరిచితమైన పేరు.

త్రిమూర్తి వంటి చిత్రాలలో ప్రతికూల పాత్రలను(విలన్) పోషించడం ద్వారా బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన అరవింద్ త్రివేది.. గుజరాత్ రాజకీయాల్లో కూడా రాణించారు. 1991 లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) టికెట్‌పై అరవింద్ గుజరాత్‌లోని సబర్కథ నుండి ఎంపీ అయ్యారు. 1991 నుండి 1996 వరకు అతను MP గా ఉన్నారు. 2002, 2002 లో అతను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి: Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..

Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..

Bathukamma: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఇవాళ్టి నుంచే పూల సంబురం..