Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..

ఆధ్యాత్మిక నగరం తిరుపతి దొంగల భయం వణికి పోతోంది. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాలుగా మారిపోయింది.

Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..
Cheddi Gang
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 06, 2021 | 6:57 AM

ఆధ్యాత్మిక నగరం తిరుపతి దొంగల భయం వణికి పోతోంది. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాలుగా మారిపోయింది. చెడ్డి గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల్లో కలవరం నెలకొంది. తాళం వేసిన ఇళ్లు, అపార్ట్ మెంట్లను దొంగల ముఠా టార్గెట్ చేసింది. విద్యానగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో చొరబడ్డ చెడ్డీగ్యాంగ్ కదలికలు సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించిన సీసీఎస్ పోలీసు బృందాలు.. శివారు ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్ చేసిన చెడ్డి గ్యాంగ్ పై కన్నేసింది. బహుళ అంతస్తుల భవనాల వద్ద బందోబస్తు, రాత్రి గస్తీ లను పెంచిన పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది.

చెడ్డీ గ్యాంగ్.. ఇప్పుడు తిరుపతి లో దొంగతనాలు పాల్పడుతోంది. చెడ్డి గ్యాంగ్ పేరు వింటేనే చాలు కరడుగట్టిన దొంగల ముఠా గుర్తుకొస్తుండటంతో తిరుపతి శివారు ప్రాంతాల్లోని జనాన్ని భయం వెంటాడుతోంది. ఒంటిపై బనియన్, డ్రాయర్ వేసుకుని అర్ధరాత్రి దాటాక ఇళ్లల్లో దొంగతనాలు చేయడంలో పేరుమోసిన చెడ్డి గ్యాంగ్ అడ్డు తగిలితే కడ తేర్చేందుకు వెనుకాడని దొంగల ముఠా పనే తిరుపతిలో వరుస దొంగతనాలకు కారణమని భావిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది.

ఉత్తర భారతానికి చెందిన చెడ్డి గ్యాంగ్ ముఠాలి తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల చోరీలకు పాల్పడ్డాయి. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చెడ్డి గ్యాంగ్ ముఠా ఇప్పుడు తిరుపతిపై పడింది. విద్యా నగర్ లోని ఒక అపార్ట్మెంట్లోకి చోరీకి యత్నించిన చెడ్డి గ్యాంగ్ సీసీ కెమెరాల కంట పడింది. దీంతో అప్రమత్తమైన అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది.

క్రైమ్ సినిమాలోని ఒక సన్నివేశంలా కనిపించే చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ సీన్లు తిరుపతిలోని చోరీలు జరిగిన అపార్ట్మెంట్ లలో ఇళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించిన విద్యా నగర్ కాలనీలోని అపార్ట్మెంట్ లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తో, సిసి ఫుటేజ్ తో గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తోంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.

అసలు ఈ చెడ్డీ గ్యాంగ్ ఎలా తిరుపతిలోకి చొరబడింది, పోలీస్ రికార్డ్స్ లో చెడ్డి గ్యాంగ్ గురించి ఏముందన్న దానిపై ఆరాతీస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో నివసించే పలు తెగలే చెడ్డీ గ్యాంగ్ అని భావిస్తున్న పోలీస్ యంత్రాంగం కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా కొన్ని రాష్ట్రాల్లోని పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో ముఠాలో 10 మందికి పైగా ఉండే దొంగల ముఠాలు వందల సంఖ్యలోనే ఉన్నాయని పోలీసులు కూడా గుర్తించారు.

చోరీకి వెళ్లే సమయంలో చొక్కా వేసుకోకుండా.. బనియన్లు, చెడ్డీలు ధరించి చేతిలో ఇనుప రాడ్లతో దొంగతనాలు పాల్పడే దొంగలు శరీరానికి నూనె పూసుకుని జాగ్రత్తలు పాటిస్తూ చోరీలకు దిగుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునే ఈ గ్యాంగ్ లో మహిళలు కూడా ఉంటారు. వారు పగలు బిచ్చగాళ్లుగా లేదంటే ఇంటింటికి తిరిగి బొమ్మలు, దుప్పట్లు విక్రయిస్తూ స్కెచ్ వేస్తే అర్ధరాత్రి దాటాక అమలు చేసేది చెడ్డి గ్యాంగ్ పని గా భావిస్తున్న పోలీస్ యంత్రాంగం వరుస దొంగతనాలతో అలర్ట్ అయింది.

ఇవి కూడా చదవండి: Diabetes: మధుమేహం ఉన్నవారికి కళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.. ఇబ్బందులు నివారించడానికి ఏమి చేయాలంటే..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?