Bathukamma: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఇవాళ్టి నుంచే పూల సంబురం..
Bathukamma Celebrations: తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవ పతాక బతుకమ్మ.. తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. తెలంగాణ జీవన చైతన్యం బతుకమ్మ.. తంగేడుపూల సౌందర్య చిహ్నం బతుకమ్మ..
Bathukamma Celebrations: తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవ పతాక బతుకమ్మ.. తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. తెలంగాణ జీవన చైతన్యం బతుకమ్మ.. తంగేడుపూల సౌందర్య చిహ్నం బతుకమ్మ.. ఆ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. పూలకున్న రెక్కల్ల తెలంగాణ విచ్చుకుంటోంది…పూల రంగులన్నీ తెలంగాణ పల్లెలపై పరుచుకునే సంబురం రానే వచ్చింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమైన బతుకుమ్మ ఉత్సవాలకు ఆడపడుచులు రెడీ అయ్యారు.. పువ్వుల పరిమళాలతో ప్రతీ గడపలోనూ వెదజల్లనుంది.. బతుకమ్మ పాటలతో 9రోజులు.. తెలంగాణ హోరెత్తనుంది.
ఆశ్వయుజ మాసం ఆరంభం.. అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుక 9రోజుల పాటు ఈ పూలజాతర కొనసాగనుంది. ఆడపడచుల ఆటపాటలతో దద్దరిల్లుతోంది. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో పువ్వులను అమ్మవారి రూపంగా కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. తంగేడు, మందార, సీతజడపువ్వులు, గుమ్మడి, గోరంటపూలు, కట్లపువ్వులు, గునుగు పువ్వులతో పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మ పాటలతో ఆరాధిస్తారు.
తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యంతో బతుకమ్మకు సమర్పిస్తారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని, పూలను ఆరాధించే అరుదైన పండుగ తెలంగాణ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీక గా ఈపండుగను చూస్తాం.నేటి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయి.. తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈతొమ్మిది రోజుల పాటు మహిళలు, చిన్నారులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడతారు.
బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు, ముఖ్యంగా చిన్నారులు సైతం సాంప్రదాయం ఉట్టిపడేలా రెడీ అయ్యి… ఊరంతా ఒకటయ్యి , తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే తెలంగాణ ప్రజల సాంస్కృతిక పండుగ. బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ, విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..
Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..