AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..

Powerball Winner: ఒక్క లాటరీ.. 5 వేల కోట్లు.. అవునూ ఒక్కరోజులో 5 వేల కోట్లకు అధిపతి కాబోతున్నాడు ఓ వ్యక్తి. ఆ ఒక్కరు ఎవరని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.

Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..
Powerball
Sanjay Kasula
|

Updated on: Oct 06, 2021 | 7:27 AM

Share

Powerball: ఒక్క లాటరీ.. 5 వేల కోట్లు.. అవునూ ఒక్కరోజులో 5 వేల కోట్లకు అధిపతి కాబోతున్నాడు ఓ వ్యక్తి. ఆ ఒక్కరు ఎవరని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. అమెరికాలో నిర్వహించే లాటరీలో పవర్‌బాల్‌ లాటరీపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు భారత కరెన్సీలో దాదాపు 5 వేల కోట్ల రూపాయల లాటరీ ఇప్పుడు ఒక్కరినే వరించబోతోంది. దీంతో ఈ లాటరీ ఎవరిని వరించబోతోంది..? లక్ష్మిదేవి ఎవరి తలుపు తట్టబోతోందని అందరిలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఇప్పటి వరకు ఉన్న లాటరీల్లో ఏడో అతి పెద్ద లాటరీ విజేతగా నిలుస్తాడు.

కాలిఫోర్నియాలోని మొర్రో బేలో పవర్‌బాల్ లాటరీ విజేతను ప్రకటించబోతున్నారు. ఈ రోజు దాదాపు 700 మిలియన్ డాలర్ల ధనవంతుడు కాబోతున్నాడు. సోమవారం రాత్రి యుఎస్ లాటరీ చరిత్రలో ఏడవ అతిపెద్ద లాటరీని క్లెయిమ్ చేసిన వారిలో ఓ వ్యక్తి ఐదు నంబర్లు, పవర్‌బాల్ నంబర్‌ను సరిగ్గా ఎంచుకున్నట్టు లాటరీ నిర్వాహకులు తెలిపారు.

సోమవారం రాత్రి గీసిన విజేత నెంబర్స్‌ 12, 22, 54, 66, 69. పవర్‌బాల్ నెంబర్‌15. లాటరీలో చివరి సెకన్‌ టికెట్ అమ్మకాల తర్వాత జాక్‌పాట్ విలువ అమెరికన్‌ డాలర్లలో 699.8 మిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్ 5 నుంచి ఎవరూ జాక్ పాట్ గెలవలేదని లాటరీ నిర్వాహకులు తెలిపారు. కాలిఫోర్నియా లాటరీ ప్రకారం విజేత 29 సంవత్సరాల్లో చెల్లించిన యాన్యుటీ లేదా 496 మిలియన్‌ డాలర్ల నగదును ఎంపిక చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ట్యాక్స్‌కు లోబడే ఉంటాయని లాటరీ నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. దసరా బోనస్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌..