AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, షాకులు.. సంచలనాలు

ఆఫ్ఘనిస్తాన్‌ పాలకులు ప్రపంచానికి మరో షాక్‌ ఇవ్వబొతున్నారు. తమ పోరాటం ఆఫ్ఘన్‌తో అయిపోలేదని.. పాకిస్తాన్‌ను

International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, షాకులు.. సంచలనాలు
International Updates
Venkata Narayana
|

Updated on: Oct 06, 2021 | 7:00 AM

Share

International Updates: ఆఫ్ఘనిస్తాన్‌ పాలకులు ప్రపంచానికి మరో షాక్‌ ఇవ్వబొతున్నారు. తమ పోరాటం ఆఫ్ఘన్‌తో అయిపోలేదని.. పాకిస్తాన్‌ను కూడా కైవసం చేసుకుంటామని ప్రకటించారు. షరియా విస్తరణను ఆఫ్ఘన్ వెలుపల పాకిస్థాన్ నుంచే మొదలుపెట్టాలని తాలిబన్ ఫైటర్లు కోరుకుంటున్నారు.

తాలిబన్స్‌ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. లాహోర్‌లో ఉన్న గురుద్వారాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రార్ధనా మందిరాన్ని ఒక ప్రభుత్వ ఆఫీస్‌గా మార్చేశారు. గురుద్వారాలో ఉన్న వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బయటపెట్టింది. హజారా జాతికి చెందిన 13 మందిని కిరాతకంగా చంపారని తెలిపింది. వారిలో ఎక్కువమంది లొంగిపోయిన సైనికులే ఉన్నారని వెల్లడించింది.

EU సమ్మిట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు స్లోవేనియాలో హింసాత్మకంగా మారాయి. విదేశి ప్రతినిధులు పాల్గొనే సదస్సును రద్దు చేయాలంటూ నిరసనకు దిగారు. ఆందోళన కారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు కురిపించారు.

మరో వైపు స్లోవెనియాలో వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు. మాకొద్దు వ్యాక్సిన్‌ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. పోలీసులు, నిరసన కారుల మధ్య రాళ్లు, తుటాల వర్షం కురిసింది. వ్యాక్సిన్‌ వల్ల చెడు పరిణామాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

ఇటలీలో కురుస్తున్న వర్షాలకు పట్టణాలు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ప్రజల తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి.

ఫ్రాన్స్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సెమినార్‌లో ఆ దేశాధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకూలమైన సమానత్వం వల్లనే ప్రపంచం ఒకే విధంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమాన ఫలాలు అందాలన్నారు.

ఫ్రాన్స్‌లోని ఓ చర్చిలో లైంగిక వేధింపుల కేసులో బయటకు వచ్చిన ఓ నివేదిక కలకలం సృష్టిస్తోంది. ఫ్రాన్స్​ క్యాథలిక్​ చర్చిలో గడిచిన 70ఏళ్లలో 3లక్షల30వేల మంది చిన్నారులు లైంగిక వేధింపుల బారినపడినట్టు నివేదిక పేర్కొంది. ఈ యవ్వారంపై ప్రభుత్వం తీవ్ర చర్యకు ఆదేశించింది.

ఇటలీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో దాదాపు 50 బస్సులు అగ్గికి బూడిదయ్యాయి. ఓ ప్రైవేటు సంస్థ పార్కింగ్‌ లాట్‌లో పార్క్‌ చేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్టు తెలుస్తోంది.

కాలిఫోర్నియా సముద్ర తీరంలో పేరుకు పోయిన ఆయిల్‌ తుట్టెను శుభ్రం చేస్తున్నారు NGO’s సంఘాలు. బీచ్‌లు కాలుష్య మయంగా మారి పోయాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Badvel By Election: బద్వేల్‌లో ప్రచారాన్ని ఉధృతం చేసిన అధికార వైసీపీ.. పార్టీ కార్యకర్తలు, నేతలకు కీలక ఆదేశాలు