Trump – Forbes 400: అమెరికా సంపన్నుల జాబితాలో ట్రంప్‌కు దక్కని చోటు.. పాపం.. గత 25 ఏళ్లలో తొలిసారిగా ఇలా..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాలం కలిసిరావడం లేదు. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ దిగ్గజమయిన ఆయన ఆస్తులు విలువ ఏ మాత్రం పెరగడం లేదు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాలం కలిసిరావడం లేదు. గత ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిచెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రంప్ ఆస్తులు విలువ గత కొన్నేళ్లుగా ఏ మాత్రం పెరగడం లేదు. అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కలేదు. అమెరికా సంపన్నులతో విడుదలైన ‘ఫోర్బ్స్ 400’ (Forbes 400) జాబితాలో ట్రంప్ చోటు కోల్పోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. గత ఏడాదికాలంలో ట్రంప్ ఆస్తుల విలువ ఏ మాత్రం పెరగలేదని ఫోర్బ్స్ వెల్లడించింది. ఏడాది క్రితం ఆయన మొత్తం ఆస్తుల విలువ 2.5 బిల్లియన్ డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు అది యధాతథంగా ఉన్నట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఫోర్బ్స్ 400 జాబితాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాంకు దిగజారుతూ వచ్చింది. ట్రంప్ ఆస్తుల విలువ పెరగకపోవడానికి కరోనా పాండమిక్ కూడా ఓ కారణంగా ఫోర్బ్స్ విశ్లేషించింది. ఫోర్బ్స్ 400 జాబితాలో చోటు దక్కించుకునేందుకు ట్రంప్ 400 మిల్లియన్ డాలర్ల దూరంలో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.
2016 నుంచి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ట్రంప్ తన రియల్ ఎస్టేట్ కంపెనీని సరిగ్గా పట్టించుకోలేదు. అలాగే తన రియల్ ఎస్టేట్ కంపెనీలోని వాటాలను మంచి అవకాశమున్నప్పుడు విక్రయించకుండా తన వద్దే అంటిపెట్టుకోవడం వంటి తప్పిదాలు ట్రంప్ ఆస్తుల విలువ యధాతథంగా కొనసాగడానికి కారణంగా ఆ దేశ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత తన వ్యాపారంపై దృష్టిపెట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ కారణంగా ఆయన తన రియల్ ఎస్టేట్ కంపెనీని లాభాల బాటలో పరుగులు పెట్టించలేకపోతున్నారు. అయితే తాను తలుచుకుంటే తన సంపాదనను పెంచుకోవడం పెద్దవిషయమేమీ కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
తన ఏలుబడిలో అమెరికాను గొప్పగా ఉద్దరించినట్లు పదేపదే చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. మరి తన వ్యాపార సాంప్రాజ్యాన్ని ఎందుకు ఉద్దరించలేకపోతున్నారని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అసమర్థ నాయకత్వానికి ఇది కూడా ఓ తార్కాణమని చెబుతున్నారు. మరి ట్రంప్ వ్యాపారం ఢీలా పడటానికి కరోనా పాండమిక్ కారణమో.. ఆయన అసమర్థ నాయకత్వమే కారణమో మరికొంత కాలం ఆగితేగానీ చెప్పలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Also Read..
Vehicles: వాహనదారులకు కేంద్రం షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త నిబంధనలు
Mahalaya Amavasya : స్మశానంలో అర్థరాత్రి మహాలయ అమావాస్య.. అనంతలో వింత జాతర