తల్లిని క్రూరంగా సుత్తితో 14 సార్లు కొట్టి చంపాడు.. ఆపై తప్పించుకునేందుకు షాకింగ్ ప్లాన్

అతడు మనిషి కాదు.. క్రూరుడు.. నీచుడు. కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఏకంగా రెండు నెలలపాటు ఇంట్లోనే ఉంచాడు.

తల్లిని క్రూరంగా సుత్తితో 14 సార్లు కొట్టి చంపాడు.. ఆపై తప్పించుకునేందుకు షాకింగ్ ప్లాన్
Mother Killed By Son
Ram Naramaneni

|

Oct 06, 2021 | 3:11 PM

అతడు మనిషి కాదు.. క్రూరుడు.. నీచుడు. కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపేశాడు.  హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 14 సార్లు కొట్టి హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ఏకంగా రెండు నెలలపాటు ఇంట్లోనే ఉంచాడు. ఇరుగుపొరుగు వారు అడిగితే.. తన తల్లికి కరోనా సోకడంతో, ఐసోలేషన్​కు వెళ్లిందని చెబుతూ వచ్చాడు. చివరకు నేరం బయటపడటంతో ఆ పాపాత్ముడు ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ సంఘటన యూకేలోని వేల్స్​ దేశం, పెంబ్రోక్​షైర్​ రాష్ట్రంలో జరిగింది.

అసలేం జరిగిందంటే…

పెంబ్రోక్​షైర్​ రాష్ట్రంలోని పెంబ్రోక్​డాక్​కు చెందిన జుడిత్​ రీడ్​ (68), తన తనయుడు డేల్​ మోర్గాన్​(43)తో నివసిస్తోంది. ఆమె అకస్మాత్తుగా అదృశ్యమయ్యింది. గత ఏడాది డిసెంబర్​ 11న చివరిసారిగా కనిపించినట్లు ఆమె పెట్ డాగ్‌ను చూసుకునే వ్యక్తి చెప్పాడు. ఇంటి పక్కన ఉండేవాళ్లు జుడిత్​ గురించి ఆడిగినప్పుడల్లా.. తన తల్లి కోవిడ్ సోకి హాస్పిటల్‌లో ఉందని చెప్పేవాడు డేల్​. ఆమె ఫోన్​ నుంచి పలువురికి మెసేజ్‌లు కూడా పెట్టేవాడు. గత ఏడాది క్రిస్మస్​కు మూడు రోజుల ముందు తండ్రి కనిపించగా.. జుడిత్​ రీడ్​ అనారోగ్యానికి గురైందని, ఆమెకు సాయంగా తాను కూడా ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పాడు డేల్​. రెండు నెలలకుపైగా జుడిత్​ రీడ్​  ఎవరికీ కనిపించలేదు. దీంతో ఆమె సన్నిహితులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. డేల్​పై ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇద్దరు పోలీసులు డేల్​ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. లోపల ఉన్న బెడ్‌రూమ్ కిటికీ తెరిచి ఉండగా.. అందులోకి చూశారు. దోమ తెరలను పక్కకు జరిపి చూడగానే వారికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. గదిలో రక్తపు మడుగులో.. బెడ్​కు సమీపంలో జుడిత్​ రీడ్​ పడి ఉంది. ఆమె తలపై ప్లాస్టిక్​ బ్యాగ్​ కప్పి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డెడ్‌బాడీని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంట్లో వెతకగా  పోలీసులకు.. 745 గ్రాముల బరువైన సుత్తి, రీడ్​ రాసిన నోట్​ ఆమె ఫోన్​ కేస్​లో దొరికింది. అందులో తన కొడుకు గురించి రాసుకున్నారు రీడ్​. డబ్బులు దొంగతనం, డ్రగ్స్​కు అలవాటు పడినట్లు పేర్కొన్నారు.

పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ మోర్గాన్​ లేడు. కానీ, ఆ మరుసటి రోజున పట్టుకుని కస్టడీకి తరలించారు అధికారులు. అతని తల్లి బ్యాంకు అకౌంట్ చెక్ చేయగా.. 2020, డిసెంబర్​- 2021 జనవరి మధ్య కాలంలో 11 ట్రాన్సాక్షన్స్​ చేశాడు మోర్గాన్​. మొత్తం 2,878 పౌండ్లు(రూ.2.92 లక్షలు) తీసుకున్నట్లు తేలింది. పోలీసులు తమ స్టైల్లో విచారించగా తానేు నేరం చేసినట్టు అంగీకరించాడు డేల్. దీంతో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కనీసం ఇరవై ఒకటిన్నరేళ్ల పాటు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది.

Son Killed Mother

Also Read: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu