PM Kisan: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..!
PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్ కూడా ఉంది..
PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్ కూడా ఉంది. అదే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు శుభవార్త అందబోతోంది. ఈ పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్రం 9 విడతల డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన కేంద్రం.. ఇప్పుడు పదో విడత డబ్బులు అందించనుంది. మోదీ సర్కార్ రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్రం రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో చేరుతున్నాయి. ఏడాదికి మూడు విడతల్లో అంటే రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. ఇప్పుడు పదో విడత కింద రూ.2 వేలు అందనున్నాయి. అక్టోబర్ 31 వరకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రైతులకు అందనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తుందనే విషయం వెల్లడించలేదు. ఇంకా ఎవరైనా ఈ పథకంలో చేరకపోతే ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి నేరుగా ఆన్‌లైన్‌లోనే మీరు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. లేదా మీ సేవకు వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. గత కొంత కాలంగా వెబ్‌సైట్‌లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ పని చేస్తోంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పొలం పట్టా వంటి వివరాలతో స్కీమ్‌లో చేరితే డబ్బులు వస్తాయి.