BSNL 4G SIM Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపరాఫర్.. ఉచిత 4G సిమ్ ప్లాన్ గడువు పెంపు..
BSNL 4G SIM Offer: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో కీలక నీర్ణయం తీసుకుంది. ఉచిత 4G సిమ్ ఆఫర్‌ను
BSNL 4G SIM Offer: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో కీలక నీర్ణయం తీసుకుంది. ఉచిత 4G సిమ్ ఆఫర్‌ను డిసెంబర్ 31, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టెలికాం నెట్‌వర్క్ ఈ ఆఫర్‌ను కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టింది. రూ.100కు పైగా రీఛార్జ్ పొందాలనుకునే వినియోగదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుందంటూ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.100కు పైగా రిఛార్జ్ చేయించుకునే వారికి ఉచిత సిమ్ కార్డు ఆఫర్ కేరళ సర్కిల్‌లో మాత్రమే అంతకుముందు అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఆఫర్ ఇతర టెలికాం సర్కిళ్లకు కూడా విస్తరించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రూ.100 కంటే ఎక్కువ రీఛార్జ్ పొందడం ద్వారా వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా.. BSNL కి ఇతర మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు మారొచ్చని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. డిసెంబర్ వరకు ఈ కొత్త నిబంధనలు అందుబాటులో ఉండనున్నాయి. దీనిద్వారా MNP పోర్ట్-ఇన్ కస్టమర్‌లకు ఉచిత 4G సిమ్ కార్డులను కూడా అందించనున్నారు. ఈ ఆఫర్ మొదట ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 4G సిమ్ ఆఫర్‌ను డిసెంబర్ వరకు పొడింగించినట్లు ప్రతినిధులు తెలిపారు. BSNL 4G SIM కార్డ్ ధర రూ. 20. అయితే.. కొత్త వినియోగదారులకు MNP పోర్ట్ నుంచి మినహాయింపు ఇస్తారు. మొదటి రీఛార్జ్ రూ.100 కంటే ఎక్కువ పొందిన కస్టమర్లకు.. ఉచితంగా బీఎస్ఎన్ఎల్ 4G సిమ్ ఇవ్వనున్నారు.
దీంతోపాటు BSNL తన ప్రమోషనల్ ప్లాన్‌లో భాగంగా రూ. 699 ప్లాన్ వాలిడిటీని 90 రోజుల పాటు పొడిగించింది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో 180 రోజుల వరకు వాలిడిటీని అందిస్తోంది. అయితే.. ఈ ప్లాన్ గడువు సెప్టెంబర్ 28 న ముగియగా.. మరో మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాన్లో 0.5GB రోజువారీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లు లభించనున్నాయి. అయితే.. ఈ ప్లాన్ కోసం వినియోగదారులు రిటైల్ షాపుల్లో రీఛార్జ్ చేయించుకోవచ్చు.
లేదా.. BSNL కస్టమర్లు PLAN BSNL699 ఫార్మాట్‌లో 123 కు మెస్సెజ్ పంపడం ద్వారా ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు దీనిని యాక్టివేట్ చేయడానికి USSD షార్ట్ కోడ్ *444 *699# డయల్ కూడా చేయవచ్చు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు SMS పంపడానికి లేదా కోడ్‌కు కాల్ చేయడానికి ముందు వారి ప్రీపెయిడ్ అకౌంట్ బ్యాలెన్స్ రూ .699 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
Also Read: