AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT 2021 Results: విద్యార్థులకు అలెర్ట్.. ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..

AP RGUKT CET Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 పరీక్ష ఫలితాలు

AP RGUKT 2021 Results: విద్యార్థులకు అలెర్ట్.. ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..
Results
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2021 | 1:20 PM

Share

AP RGUKT CET Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మంత్రి సురేష్‌ ఈ ఫలితాలను ప్రకటించారు. సెప్టెంబర్‌ 26న AP RGUKT Cet పరీక్ష నిర్వహించారు. అయితే ఏపీ విద్యాశాఖ రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. అయితే.. ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, సెట్ బాధ్యులు పాల్గొన్నారు.

ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఇలా.. 1. ఎం. గుణశేఖర్‌ (ధర్మవరం, అనంతపురం) 2. శ్రీచక్రధరణి ( మైదుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా) 3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా) 4. వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ కడప జిల్లా) 5. జి. మనోజ్ఞ (మండపేట, తూర్పు గోదావరి జిల్లా)

ఫలితాలను ఇలా తెలుసుకోండి.. మొదట ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అధికారిక వెబ్‌సైట్ – rgukt.in ని సందర్శించాలి. . హోమ్‌పేజీలో ‘ RGUKT CET 2021 ‘ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు.. పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలని. ఆ తర్వాత ఫలితం, ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి.

Also Read: 

Appsc Recruitment-2021: ఏపీపీఎస్‌సీ ఉద్యోగ నోటిఫికేషన్‌ .. 151 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

CRPF Recruitment 2021: రాత పరీక్ష లేకుండానే సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. ఎలాగంటే..!