APPSC Recruitment 2021: ఏపీపీఎస్‌సీ ఉద్యోగ నోటిఫికేషన్ .. 151 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
APPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో..
APPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 151 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఏపీపీఎస్‌సీ.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్‌సీ తర్వాత ప్రకటిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 151 ► విద్యార్హతలు: మెడికల్ ఆఫీసర్ (యునానీ) యునానీలో డిగ్రీ పాస్ కావాలి.
► దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4
► దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25
► విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
►వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లలోపు ఉండాలి.
► దరఖాస్తు ఫీజు- రూ.250 ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.120 ఎగ్జామ్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్
► మెడికల్ ఆఫీసర్ (యునానీ) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
► మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
► మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
► హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
► అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
► యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
► ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
► ఆ తర్వాత వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
►- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
► పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
► అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.