AP Civil Assistant Surgeon: ఏపీ ప్రభుత్వ విభాగంలో 224 ఉద్యోగాలు.. వేతనం53,500.. దరఖాస్తు చేసుకోండిలా..!
AP Civil Assistant Surgeon: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తు్న్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఆయా విభాగాలలో..
AP Civil Assistant Surgeon: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తు్న్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
► అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. సెప్టెంబర్ 29, 2021 నాటికి ఇంటర్న్‌షిప్‌తో ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.
► వయసు: 42 ఏళ్లు మించకూడదు.
► జీతం: నెలకు రూ.53,500 జీతం.
► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజీ, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
► దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.
► దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 19, 2021
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
► పూర్తి వివరాల కోసం ఈ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి
కాగా, ఇప్పటికే పలు ప్రభుత్వ వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజలకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది.