Railway Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ కేంద్రంగా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Oct 06, 2021 | 2:20 PM

రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ.

Railway Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ కేంద్రంగా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి
South Central Railway Recru

Follow us on

రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్తులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే లోని 35 ఎస్టాబ్లిష్‌మెంట్‌లలోని 11 ట్రేడ్‌లలో ఈ 4,103 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను టెన్త్‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా ఎంపిక చేస్తారు.

వయసు: 24 ఏళ్లు మించకూడదు.

అర్హత: పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో..

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజీ, ఇంటర్న్‌షిప్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:  రూ.100 చెల్లించాలి

దరఖాస్తులకు ప్రారంభ తేది: అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి

దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 3 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: scr.indianrailways.gov.in 

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడండి.

ఇవి కూడా చదవండి: Badvel By Election: బద్వేల్‌ బరిలో బీజేపీ లిస్ట్‌.. ఆ ఐదుగురి పేర్లపై అధిష్టానం ఫోకస్..

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. దసరా ముందు ఇదేం బాదుడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu