అభ్యర్థులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్, ఢిల్లీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి, ఆపై 2021 అక్టోబర్ 5 నుండి హోమ్ పేజీలో ఇచ్చిన ‘ What’s New’ విభాగంలో ఇచ్చిన లింక్‌కు సంబంధించిన నియామక ప్రకటనను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు కోసం దరఖాస్తు ఫారం నియామక ప్రకటనలో ఇవ్వబడింది. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఫారమ్‌ని పూర్తిగా పూరించండి. అవసరమైన డాక్యుమెంట్‌లను జత చేసి 15 నవంబర్ 2021 లోపు చిరునామాకు సమర్పించండి. చిరునామా: ఆదాయ పన్ను డిప్యూటీ కమిషనర్ (ప్రధాన కార్యాలయం-సిబ్బంది), గది నం -378A, C.R. బిల్డింగ్, IP ఎస్టేట్, న్యూఢిల్లీ – 110002.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 5 పోస్టులలో నియామకం జరుగుతుంది. దీనిలో దరఖాస్తు చేసుకోవడానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ 11 పోస్టులపై నియామకం ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. అలాగే, తప్పనిసరిగా 8000 KDPH డేటా ఎంట్రీ స్పీడ్ కలిగి ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 కోసం 5 పోస్టులు కేటాయించబడ్డాయి. ఇందులో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12 వ పాస్‌తోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో 10 నిమిషాల డిక్టేషన్ , నిమిషానికి 50 పదాల వేగంతో ఇంగ్లీష్ , కంప్యూటర్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ వేగంతో నిమిషానికి 65 పదాలు కలిగి ఉండాలిగే సామర్ధ్యం ఉండాలి.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఈ ఖాళీ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు అన్ని పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు.. గరిష్టంగా 27 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
ఇవి కూడా చదవండి: అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..