అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోకిరీల ఆట కట్టించారు. ఆడపిల్లలను వేధిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పారు స్థానికులు. 10వ తరగతి విద్యార్థినులను వేధిస్తుండటంతో వారిని చితకబాదారు.

అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..
Pokirilu


ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోకిరీల ఆట కట్టించారు స్థానికులు. స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నవారిని.. ఆటపట్టించడం.. రోడ్డుపైకి వచ్చిన అమ్మాయిల పట్ల వెకిలివేశాలు వేయడం.. సూటి పోటి మాటలతో వేదించడం వారికి అలవాటుగా మారింది. స్థానికులు కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునేవారు లేకపోవడంతో చూసి చూడనట్లుగా వ్యవహరించారు. ఇక వారి ఆగడాలను సహించేది లేదని శాస్తి చేశారు. ఆడపిల్లలను వేధిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పారు.

అటుగా వెళ్తున్న 10వ తరగతి విద్యార్థినులను వెకిలివేశాలతో వేధిస్తుండటంతో వారిని స్థానికులు పట్టుకున్నారు. ఎంటని ప్రశ్నిస్తే తిరగబడేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని స్థానికులు చితకబాదారు. మరోసారి ఇలాంటి వెర్రి వేషాలేస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

స్థానికంగా ఉండే ఇద్దరు పోకిరీలు రోజూ స్కూల్‌కు వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. వారి వెకిలి చేష్టలతో విసిగిపోయిన అమ్మాయిలు.. కుటుంబసభ్యులకు చెప్పడంతో వారిని పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి: Tirumala Brahmotsavam: ఇవాళ్టి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. రంగ రంగ వైభవంగా ముస్తాబైన తిరుమలగిరులు

Tirumala Brahmotsavam: ఇవాళ్టి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. రంగ రంగ వైభవంగా ముస్తాబైన తిరుమలగిరులు

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu